2027 వరల్డ్ కప్ జట్టులో రోకో: వయస్సు కాదు.. ఫిట్ నెస్, ఫామ్ ప్రాతిపదిక.!
Published on: Thu Oct 22, 2026 11:14AM
టీమ్ ఇండియా దిగ్గజ ఆటగాళ్లు రోహిట్ శర్మ, కింగ్ కోహ్లీ వచ్చే ఏడాది జరగనున్న వన్డే వరల్ట్ కప్ జట్టులో ఉంటారా? ఉండరా అంటూ గత కొంత కాలంగా ఎడతెగకుండా జరుగుతున్న చర్చకు బీసీసీఐ తెరదించింది. రోహిట్ శర్మ, విరాట్ కోహ్లీలు వన్డే వరల్డ్ కప్ జట్టులో ఉంటారనీ, అయితే వారి ఎంపికకు వయస్సు ఇసుమంతైనా అడ్డంకి కాదనీ కుండబద్దలు కొట్టింది. ఆ ఇద్దరు ఆటగాళ్ల ఫామ్, ప్రదర్శన, ఫిట్ నెస్ ఇవే వారి ఎంపికకు ప్రాతిపదిక, ప్రామాణికం అని తేల్చి చెప్పింది.

వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్ లో వీరిరువురూ ఆడతారా? లేదా అంటూ నెట్టింట, క్రికెట్ అభిమానుల మధ్య నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ.. బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ ఓ ఇంటర్వ్యూలో వీరిరువూరు వన్డే వరల్డ్ కప్ జట్టు సభ్యులని విస్పష్టంగా చెప్పారు. ఒక ఆటగాడు దేశం తరఫున మ్యాచ్‌లు గెలిపించే సత్తా కలిగి ఉండి, పూర్తిస్థాయిలో ఫిట్‌గా ఉన్నట్లయితే వయసుతో సంబంధం లేకుండా జట్టులోకి ఎంపిక కావడానికి అర్హుడని ఆయన స్పష్టం చేశారు. యువ ఆటగాళ్లతో పాటు అనుభవజ్ఞులైన సీనియర్లు జట్టులో ఉండటం ప్రయోజనకరమన్నారు.
ప్రస్తుతం యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో జట్టు సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. జట్టులో నాయకత్వ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడంలో, క్లిష్ట సమయాల్లో యువ కెప్టెన్‌కు తగిన మార్గదర్శకత్వం అందించడంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి సీనియర్‌ల అనుభవం దోహదపడుతుందని బోర్డు భావిస్తోంది. కెప్టెన్‌తో పాటు బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో బాధ్యతలను పంచుకోవడానికి సీనియర్ ఆటగాళ్ల ఉనికి ఎంతో అవసరమని మిథున్ మన్హాస్ అన్నారు.

గతంలో టీ20, టెస్ట్ ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన విరాట్, కోహ్లీలు ప్రస్తుతం వన్డే క్రికెట్‌పైనే పూర్తిగా దృష్టి సారించారు. రాబోయే మెగా టోర్నమెంట్‌ను దృష్టిలో ఉంచుకుని తమ ఆటతీరును మరింత మెరుగుపరుచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. మైదానంలో వారి అనుభవం, ఒత్తిడిని జయించే తత్వం యువ జట్టుకు కొండంత బలాన్ని ఇస్తాయని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
[Rohit Sharma, Virat Kohli ODI World Cup 2027, Team, Mithun Manhas, BCCI, Team Selection, Telugu One]


