కోకాపేట్‌లో రోడ్డు ప్రమాదం.. ఇంటర్ విద్యార్థి మృతి..!
Published on: Sun Sep 13, 2026 5:50PM

స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా మిగతా స్నేహితులంతా కలిసి అతని ఇంటికి వెళ్లి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం స్నేహితులంతా సరదాగా లాంగ్ డ్రైవ్‌కు బయలు దేరగా.. కారు ప్రమాదానికి గురై ఒకరు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కోకాపేట్‌లో చోటుచేసుకుంది. హైటెక్ సిటీలోని తేజు కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులంతా కలిసి తమన్ వర్మ పుట్టినరోజు పార్టీకి వెళ్లారు. పుట్టిన రోజు వేడుకలు పూర్త య్యాక మియాపూర్ నుంచి కోకాపేట్ నియో పోలీస్ వద్దకు లాంగ్ డ్రైవ్ కోసం బయలుదేరారు.
మొత్తం తొమ్మిది మంది విద్యార్థులు ఒకే ఇన్నోవా క్రిస్టా కారులో ప్రయాణిస్తు న్నారు. నియో పోలీస్ వద్ద వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి మూడు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మదన్ మోహన్ రెడ్డి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఎనిమిది మంది ఇంటర్ విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారంతా ఇంటర్ విద్యార్థులేనని, వారిలో మైనర్లు కూడా ఉన్నట్లు సమాచారం... మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
[ Road accident in Kokapet, Friend birthday, Long drive, Neo Police, Hi-Tech City, Hyderabad police, Telangana police, CP Sajjanar, Telugu One, Telugu News ]


