TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సెల్‌ఫోన్‌ రిపేర్‌కు వెళ్తూ.. మృతి చెందిన యువతి..!

Published on: Sun Sep 13, 2026 4:01PM

సెల్‌ఫోన్‌లో చిన్న సమస్యను సరిచేయించుకునేందుకు బయటకు వెళ్లిన ఓ యువతి.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపో యింది. అమీర్‌పేట్‌కు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం ఆమె కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన శనివారం చోటుచేసు కుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన వి. హేమదుర్గ (26) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటూ బంజారాహిల్స్‌లోని ఓ కార్ల కంపెనీలో పనిచే స్తోంది. 

సెల్‌ఫోన్‌ రిపేర్‌ చేయించుకునేందుకు కార్యాలయం నుంచి అనుమతి తీసుకున్న హేమదుర్గ.. రాపిడో బైక్‌పై అమీర్‌పేట్‌కు బయలుదేరింది. అయితే శ్రీనగర్‌ కాలనీలోని బిగ్‌ బజార్‌ వెనుక గేటు సమీపంలోకి చేరుకోగానే అనూహ్య ఘటన చోటుచేసుకుంది. హేమదుర్గ ప్రయాణిస్తున్న బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ షేక్‌ అన్వర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

 

 

[ Road accident at Ameerpet, Srinagar Colony, Big Bazaar, Crime news, Rapido Bike, Driver Sheikh Anwar, Hyderabad police, Telangana police, CP Sajjanar, Telugu One, Telugu News ]