TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శ్రీశైలం క్షేత్రంలో చెంచు మహిళల వరలక్ష్మీ వ్రతం.!

Published on: Sat Sep 5, 2026 11:26AM

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో శ్రావణ మాస వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో నల్లమల అటవీ ప్రాంతానికి చెందిన చెంచు మహిళల కోసం ప్రత్యేకంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని శుక్రవారం (సెప్టెంరబ్ 4) అత్యంత వైభవంగా  నిర్వహించారు.

స్థానిక చంద్రావతి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ విశిష్ట పూజా కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నంద్యాల, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు చెందిన నల్లమల అటవీ ప్రాంతాలు,  మారుమూల గిరిజన తండాల నుంచి  వెయ్యి రెండువందల 33 మంది  చెంచు మహిళలు ఈ సామూహిక వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్నారు.   దేవస్థానమే   ఈ గిరిజన మహిళల రాకపోకలకు ప్రత్యేక రవాణా వసతులు కల్పించింది. ఈ ప్రత్యేక వేడుకకు అవసరమైన పూజా సామాగ్రి మొత్తాన్ని దేవస్థానమే సమకూర్చింది. పసుపు, కుంకుమ, పూజా ద్రవ్యాలు, తోరణాలు, కలశాలను ఆలయ అధికారులు ముందే సిద్ధం చేశారు. అర్చకులు శాస్త్రోక్తంగా గణపతి పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించి, వేద మంత్రోచ్ఛారణల నడుమ పూజా విధానాన్ని జరిపించారు. 

వేదికపై కొలువుదీరిన శ్రీ మల్లికార్జున స్వామి భ్రమరాంబికా దేవి ఉత్సవ మూర్తులకు షోడశోపచార పూజలు  నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్తయిదువులందరూ భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ దేవి అష్టోత్తర శతనామ పూజను పూర్తి చేశారు. 
వ్రత పూజలు ముగిసిన తర్వాత ప్రతి మహిళకు ఆలయ అధికారులు ప్రసాదంతో పాటు పసుపు, కుంకుమ, పూలు, గాజులు, పవిత్ర తులసి మొక్కలను అందజేశారు. అలాగే ఆలయ మాసపత్రిక శ్రీశైల ప్రభతో పాటు స్వామివారి   శేషవస్త్రాలను కానుకలుగా బహూకరించారు. పూజల అనంతరం చెంచు మహిళలందరికీ ఉచితంగా శ్రీ మల్లికార్జున స్వామివారి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. గిరిజన ప్రాంతాల్లో సనాతన హిందూ ధర్మాన్ని మరింత వ్యాపింపజేయడమే లక్ష్యంగా దేవస్థానం ఇలాంటి సత్కార్యాలు చేపడుతున్నట్లు ఆలయ ఈఓ  వెల్లడించారు. భవిష్యత్తులోనూ గిరిజనుల భాగస్వామ్యంతో మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలను విస్తృతం చేస్తామనిన్నారు.  

[Srisailam Devasthanam, Chenchu Women Varalakshmi Vratam, Srisailam News, Mallikarjuna Swamy Temple, Telugu One]