ఎమ్మెల్యేగా కేసీఆర్ వేతనాలపై రేవంత్ ధ్వజం.!
Published on: Wed Sep 2, 2026 12:08PM

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు అవుతున్న సంగతి తెలిసిందే. అధికారం కోల్పోయిన తరువాత ఇన్నేళ్లలో ఆయన అసెంబ్లీకి హాజరైన సందర్భాలు ఒకటి రెండు కంటే ఎక్కువ లేవు. అయితే ఎమ్మెల్యేగా మాత్రం ఆయన జీత భత్యాలను నిర్మొహమాటంగా తీసుకుంటున్నారు.

ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను, అసెంబ్లీని గౌరవించడంలో ప్రతిపక్ష నేత కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు.

ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్‌ను లక్ష్యం విమర్శలు గుప్పించడానికి ఎంచుకోవడం తెలంగాణలో పొలిటికల్ హీట్ ను పెంచింది. ఎమ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
అసెంబ్లీకి డుమ్మా కొట్టి కూడా నిస్సిగ్గుగా గత రెండేళ్లలో కేసీఆర్ జీతం రూపంలో రూ. 1.24 కోట్లు తీసుకున్నారని రేవంత్ పేర్కొన్నారు. అసెంబ్లీకి హాజరు కాకుండా ఎమ్మెల్యేగా కేసీఆర్ జీత భత్యాలు తీసుకుంటున్నారన్న అంశం ఇప్పుడు సామాజిక మాధ్యమంలో హాట్ హాట్ గా వైరల్ అయ్యింది. 2023 ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ దాదాపుగా ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. ఇక ఇప్పుడు రేవంత్ విమర్శలు, నిలదీత తరువాతైనా కేసీఆర్.. ఫామ్ హౌస్ లో అజ్ణాత వాసానికి చుక్క పెట్టి ప్రజాక్షేత్రంలోకి వస్తారేమో చూడాలి.
[Revanth Reddy, KCR Assembly Absence, Telangana Assembly, BRS Leader KCR, Salarie, Telangana Politics, Telugu One]


