TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కరవు సీమ కాదు: సిరులు పండే నేల.. హార్టీ కల్చర్ హబ్.!

Published on: Fri Oct 2, 2026 5:34PM

రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతాన్ని  హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి 'రాయలసీమ హార్టికల్చర్ హబ్', 'ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్'లకు ఆయన శంకుస్థాపన చేశారు.

ఒకప్పుడు రాళ్ల సీమగా, కరవు ప్రాంతంగా ముద్రపడిన రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామన్నా చంద్రబాబు ఎన్నికల సమయంలో తమను నమ్మి విజయం అందించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా నిరంతరం శ్రమిస్తున్నామన్నారు. సీమ బిడ్డగా ఈ ప్రాంత అభివృద్ధిని చూసేందుకు ఎంతో ఆనందంగా ఉందని ఉద్వేగంగా వెల్లడించారు.

రాయలసీమలో భూసారం, వాతావరణ పరిస్థితులకు తగినట్లుగా హార్టికల్చర్ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందనీ,  ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించడం ద్వారా స్థానిక రైతులకు ఆర్థికంగా స్థిరత్వం చేకూర్చడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమనీ చెప్పారు. ఈ హబ్ ఏర్పాటుతో ఈ ప్రాంతం ఉద్యాన పంటల ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కరవు  సీమ సిరుల సీమగా  మారుస్తామన్నారు. 

2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన నాటి నుంచి ఈ ప్రాంత ప్రజల సంక్షేమం, ప్రగతే ధ్యేయంగా పాలన సాగుతోందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. తాజా నిర్ణయాలు ఈ ప్రాంతంపై ఆధారపడిన వ్యవసాయ కుటుంబాల తలరాతను పూర్తిగా మార్చివేస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

 హార్టికల్చర్ హబ్ ఏర్పాటు ద్వారా స్థానిక రైతులు నాణ్యమైన విత్తనాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మరియు మార్కెట్ సదుపాయాలను సులభంగా పొందగలుగుతారు. దీనివల్ల ఉత్పాదకత పెరిగి, వలసల నివారణకు కూడా అవకాశం ఉంటుందన్నారు.

భవిష్యత్తులో రాయలసీమను పరిశ్రమలు మరియు ఉద్యాన పంటల కేంద్రంగా అభివృద్ధి చేయడానికి మరిన్ని భారీ ప్రాజెక్టులు తీసుకురానున్నట్లు చెప్పారు. 

[Rayalaseema Horticulture Hub, CM Chandrababu Madanapalle Meeting, Andhra Pradesh Garden Development, NDA Government,  Rayalaseema, Andhra Pradesh,telugu one]