కుక్కర్‌లో ప్రతి ఫుడ్‌ని ఉడికించేస్తున్నారా? అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి

posted on: Jul 2, 2026 5:58PM


కుక్కర్‌లో ప్రతి ఫుడ్‌ని ఉడికించేస్తున్నారా? అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి

మనం తినే ఆహారాన్ని ఎంత ఎక్కువగా ఉడికిస్తే అంత మంచిదని చాలామంది భావిస్తుంటారు. కానీ అధికంగా ఉడికించడం వల్ల కొన్ని పోషకాలు తగ్గిపోయే అవకాశం ఉంటుందని ప్రముఖ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్, హోలిస్టిక్ లైఫ్‌స్టైల్ నిపుణురాలు శ్రీదేవి జాస్తి ఈ ఇంటర్వ్యూలో వివరించారు.

ప్రతిరోజూ తినే ఆహారంలో కొంత భాగమైనా రా ఫుడ్‌కు కేటాయించాలని ఆమె సూచిస్తున్నారు. ముఖ్యంగా మొలకలు (Sprouts), తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వంటి సహజ ఆహారాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు మరింత సహజ రూపంలో అందుతాయని ఆమె చెబుతున్నారు.

అలాగే ప్రతి ఆహార పదార్థాన్ని ప్రెషర్ కుక్కర్‌లో ఎక్కువసేపు ఉడికించడం అలవాటుగా మార్చుకోవద్దని, ఏ ఆహారాన్ని ఎలా తీసుకుంటే శరీరానికి ఎక్కువ ప్రయోజనం ఉంటుందో తెలుసుకుని ఆ విధంగా వంట చేయాలని సూచిస్తున్నారు.

ఆరోగ్యకరమైన జీవనశైలి, సహజ ఆహారం, సరైన వంట విధానాలు, రోజువారీ డైట్‌లో రా ఫుడ్ ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ వీడియో ఉపయోగపడుతుంది.

మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)

google-ad-img
    Related Sigment News
    • Loading...