TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాప్తాడు దాడి బాధితురాలు కోలుకుంటోంది: గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేష్.!

Published on: Mon Nov 2, 2026 11:37AM

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రాప్తాడు ప్రభుత్వ పాఠశాల దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలిక కోలుకుంటున్నది. ప్రస్తుతం బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న బాధితురాలి ఆరోగ్యం కుదుటపడుతోంది. ఈ విషయాన్ని ఏపీ మంత్రి నారా లోకేష్ స్వయంగా వెల్లడించారు.  పాఠశాల ప్రాంగణంలో ఓ దుండగుడు జరిపిన పాశవిక దాడిలో  తీవ్రంగా గాయపడిన  బాలిక చికిత్సకు స్పందిస్తున్నదనీ, ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడినట్లేనని వైద్యులను ఉటంకిస్తూ నారా లోకేష్ తెలిపారు.  

  ఆ చిన్నారి స్ఫృహలోనే  ఉందని, ఆమెను కన్నతల్లి స్వయంగా కలిసి పరామర్శించి ధైర్యం చెప్పిందని తెలిపారు.  వైద్యుల బృందం అందించిన తాజా నివేదిక ప్రకారం బాలిక ఆరోగ్య బాగా మెరుగుపడిందనీ, సోమవారం సాయంత్రానికి ఆమెకు   వెంటిలేటర్ సపోర్ట్‌ను తొలగించే అవకాశాలున్నాయని లోకేష్ వివరించారు.  రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో జరిగిన పాశవిక దాడిపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి.  

ప్రభుత్వం బాధితురాలి కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలుస్తోంది. మెరుగైన వైద్యం అందించడంలో భాగంగానే చిన్నారిని   బెంగళూరులోని అత్యున్నత ఆస్పత్రికి తరలించారు. మంత్రి నారా లోకేష్ స్వయంగా ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తూ, ఎప్పటికప్పుడు వైద్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. చిన్నారి ఆరోగ్యం కుదుటపడుతోందన్న కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.  ప్రభుత్వం   సకాలంలో చొరవ,  వైద్యుల నిరంతర శ్రమ ఫలితంగా తీవ్రంగా గాయపడిన చిన్నారి ప్రాణాపాయం నుంచి బయటపడిందని పరిశీలకులు అంటున్నారు. ఆమె   త్వరలోనే పూర్తిగా కోలుకుని సాధారణ స్థితికి వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  

[Raptadu school attack Victim Health Update, Lokesh, Good News, Manipal Hospital, Recovering, Bengalure, Hospital, Telugu One]