TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాప్తాడు నిందితుడిపై పోలీసుల కాల్పులు: అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స.!

Published on: Mon Nov 2, 2026 11:20AM

అనంతపురం జిల్లా రాప్తాడులో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థినిపై చెట్లు కత్తిరించడానికి ఉపయోగించే ఎలక్ట్రిక్ రంపంతో  దాడికి పాల్పడిన  నిందితుడిని పట్టుకునే క్రమంలో  అతడిపై పోలీసులు కాల్పులు జరిపారు.  పరారీలో ఉన్న నిందితుడిని గాలిస్తుండగా పోలీసులకు సదరు నిందితుడు ఎదురుపడ్డాడు. పోలీసులు లొంగిపోవాలని హెచ్చరించినప్పటికీ నిందితుడు పట్టించుకోలేదు సరికదా పోలీసులపై ఎదురు తిరిగాడు. దీంతో అనివార్య పరిస్థితుల్లో ఆత్మసంరక్షణార్థంపోలీసులు నిందితుడిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు.  

వివకాలిలా ఉన్నాయి. రాప్తాడులోని జడ్పీ హైస్కూల్‌లో క్లాస్ జరుగుతున్న సమయంలో హేమంత్ అనే యువకుడు చొరబడి విద్యార్థినిపై   దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడి తరువాత నిందితుడు హేమంత్ పరారయ్యాడు.

నిందితుడిని పట్టుకోవడానికి  15 ప్రత్యేక బలగాల బృందాలు రంగంలోకి దిగాయి. నిరంతరం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు, ఆత్మకూరు అటవీ ప్రాంతం సమీపంలో నిందితుడు సంచరిస్తున్నట్లు పక్కా సమాచారం అందింది. ఆ సమాచారం మేరకు  పోలీసు బృందాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించాయి. ఆ సమయంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు యత్నించిన నిందితుడు హేమంత్, పోలీసులపైకి రాళ్లతో దాడి చేశాడు. అంతటితో ఆగకుండా  పాటు కత్తితో  ఎదురుతిరిగాడు. ఈ దాడిలో   ఒక ఇన్‌స్పెక్టర్‌ గాయపడ్డారు.

పరిస్థితి చేయి దాటిపోతుండటంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం నిందితుడిపై కాల్పులు జరపారు.  ఈ కాల్పుల్లో   నిందితుడు గాయపడ్డాడు. పోలీసులు అతడిని అదుపులోనికి తీసుకుని   చికిత్స నిమిత్తం అనంతపురం  ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. 


[Raptadu School Attack Accused Hemanth, Injured, Police Firing,  Hemanth arrested, Raptadu Student Assault Case, Telugu One]