TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

హైదరాబాద్‌లో ర్యాపిడో డ్రైవర్‌పై దారుణ దాడి.. తీవ్ర గాయాలు.!

Published on: Sun Nov 29, 2026 11:38AM

హైదరాబాద్‌లోని లంగర్ హౌస్ సమీపంలో ర్యాపిడో డ్రైవర్‌పై గుర్తుతెలియని వ్యక్తులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. బాపూఘాట్ వద్ద జరిగిన ఈ ఘటనలో ఫలక్‌నుమా సదాత్ నగర్‌కు చెందిన ఇర్ఫాన్ ఖురేషీ తీవ్రంగా గాయపడ్డారు. దుండగుల దాడిలో ఆయన రెండు కాళ్లతో పాటు కాలర్ బోన్ (మెడ కింది ఎముక) కూడా విరిగినట్లు సమాచారం.

టోలిచౌకి వద్ద ఓ రైడ్‌ను పూర్తి చేసుకున్న ఇర్ఫాన్.. మరో రైడ్ కోసం బాపూఘాట్ వైపు వెళ్తుండగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై ఒక్కసారిగా దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం బాధితుడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ఘటనపై స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ.!

ఈ దాడి ఘటనపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వెంటనే స్పందించారు. బాధితుడికి న్యాయం జరిగేలా చూడాలని, నిందితులపై తక్షణ చర్యలు తీసుకోవాలని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్‌ను ఆదేశించారు.

ఇది కూడ చదవండి: ఏపీ పంచాయతీ ఎన్నికల రెండో దశలో పోలింగ్ జోరు.. పలుచోట్ల ఉద్రిక్తతలు.!

ఒవైసీ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఏసీపీని కలిశారు. అనంతరం డీసీపీతో ఫోన్‌లో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. నిందితులను త్వరగా గుర్తించి అరెస్ట్ చేయాలని పోలీసులను కోరారు.

నిందితుల కోసం మూడు ప్రత్యేక బృందాలు.!

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. దాడికి గల కారణాలు, నిందితుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

మరోవైపు ఉస్మానియా ఆసుపత్రి ఆర్‌ఎంఓతో మాట్లాడిన ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్.. బాధితుడు ఇర్ఫాన్‌కు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. బాధితుడి కుటుంబానికి ఎంఐఎం పార్టీ అండగా ఉంటుందని, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చూస్తామని పార్టీ నేతలు స్పష్టం చేశారు.

మీకు నచ్చవచ్చు: మాజీ డిప్యూటీ మేయర్ హత్యకు భారీ కుట్ర.. గంటల్లోనే ఛేదించిన పోలీసులు.!

మీకు నచ్చవచ్చు: పెళ్లి పేరుతో మోసం: రూ. 10 లక్షలకు కుచ్చుటోపీ.! 


[ Rapido Driver Attack, Langer Houz Attack, Irfan Qureshi, Bapu Ghat, Hyderabad Crime News, Asaduddin Owaisi, Kausar Mohiuddin, Langer Houz Police, Hyderabad Police ]