గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి ఇండియన్ ప్రజ్ణానంద.!
Published on: Fri Aug 28, 2026 8:59AM

ఇండియన్ యువ చెస్ ప్లేయర్ రమేష్ బాబు ప్రజ్ణానంద చరిత్ర సృష్టించాడు. ప్రతిష్ఠాత్మక గ్రాండ్ చెస్ టూర్ టైటిల్‌ను సాధించి ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్ గా నిలిచాడు. అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో వరల్డ్ నంబర్ 2 ఫ్యాబియానో కరువానాపై రమేష్ బాబు ప్రజ్ణానందం విజయం సాధించాడు.
గురువారం (ఆగస్టు 27) జరిగిన ఫైనల్ లో ప్రజ్ఞానంద తొలుత కరువానా కంటే ఆరు పాయింట్లు వెనుకబడి ఉన్నప్పటికీ.. రెండు ర్యాపిడ్ గేమ్‌లలోనూ గెలిచి ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఆ తర్వాత జరిగిన బ్లిట్జ్ గేమ్‌లలోనూ సమంగా నిలిచి, 15-13 స్కోర్‌తో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. విజేతగా నిలిచిన ప్రజ్ఞానందకు 1.91 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ లభించింది.
వాస్తవానికి ఈ టోర్నీ ఆరంభంలో కరువానా చేతిలో తొలి క్లాసికల్ గేమ్‌లో ప్రజ్ఞానంద పరాజయం పాలయ్యాడు. రెండో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. దీంతో చివరి రోజు ఆటలో వెనుకబడిన ప్రజ్ణానంద.. అసమాన పోరాట పటిమతో విజయాన్ని అందుకున్నాడు.
Ramesh Babu Pragnanada creats Histort, Grand, Chess Tour, Titile, Win


