దేవినేని నెహ్రూతో వర్మ.. వర్మకు హెచ్చరిక..

 

దర్శకుడు రాంగోపాల్ వర్మ వంగవీటి సినిమా కోసం విజయవాడకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన దేవినేని నెహ్రూతో సమావేశమయ్యారు. దీంతో బెజవాడ మొత్తం వంగవీటి హడావుడితో ఉన్నట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా మరోవైపు ఈసినిమాకి రావాల్సిన విమర్శలు వస్తూనే ఉన్నాయి. సీపీఐ నగర కార్యదర్శి శంకర్ వంగవీటి రాంగోపాల్ వర్మను హెచ్చరించారు. కమ్యూనిస్టు నేత తలసాని వెంకటరత్నంను రౌడీగా చిత్రీకరించాలని చూస్తే తాము సహించమని అన్నారు. అసలు రాంగోపాల్ వర్మకు ఏం తెలుసు.. పేదల కోసం తలసాని వెంకటరత్నం అనేక పోరాటాలు చేశారు..  బెజవాడలో కమ్యూనిస్టు ఉద్యమాల చరిత్ర రామ్గోపాల్ వర్మకు ఏం తెలీదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.