నంది అవార్డులపై వర్మ సెటైర్లు...

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై చెలరేగుతున్న దుమారం తెలిసిందే కదా. అవార్డుల ఎంపికలో అన్యాయం జరిగిందంటూ.. ఏకపక్షంగా అవార్డులు ఇవ్వడం జరిగిందంటూ.. పలువురు నిర్మాతలు.. డైరెక్టర్లు.. ఇంకా ఫ్యాన్స్ చాలామందే విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇంత హడావుడి జరుగుతున్నా ఒక వ్యక్తి మాత్రం ఇంత వరకూ ఎందుకు స్పందించలేదబ్బా అని అందరూ అనుకున్నారు. తన రెస్పాన్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. ఇంకేంటి ఆ వ్యక్తి నుండి రెస్పాన్స్ రానే వచ్చింది. ఇంతకీ ఎవరా గొప్ప వ్యక్తి అనుకుంటున్నారా... ?ఇంకెవరూ.. రామ్ గోపాల్ వర్మ. వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. అన్నీ నాకే కావాలి అని అనుకుంటాడు. అన్ని విషయాల్లో వేలు పెడతాడు. అలాంటిది నంది అవార్డుల విషయంలో ఇంత గందరగోళం జరుగుతున్నా..వర్మ ఇంతవరకూ స్పందింలేదు ఏంటబ్బా అని అనుకుంటుండగానే... రియాక్షన్ వచ్చింది. నంది అవార్డులపై తన ఫేస్ బుక్ లో కొన్ని పోస్టులు చేశాడు.

 "నంది అవార్డు కమిటీకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి.. అబ్బో అబ్బో అబ్బో!!! ఇప్పుడే నంది అవార్డ్స్ లిస్ట్ మొత్తం చూసా... వామ్మో మైండ్ బ్లోయింగ్ ఎక్స్ ట్రార్డినరీ సూపర్ డూపర్ సెలక్షన్ ..నాకు తెలిసి ఇలా ఏమాత్రం 1% పక్షపాతం లేకుండా కేవలం మెరిట్ మీద మాత్రమే అవార్డ్స్ ఇచ్చిన కమిటీ మొత్తం ప్రపంచంలోనే ఉండి ఉండదు.. ఇంత అద్భుతమైన నిజాయతీ గల నంది అవార్డు కమిటీకి ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు ఇవ్వాలి .. వావ్.. నంది అవార్డ్స్ కమిటి మెంబర్లూ ఐ వాంట్ టు టచ్ ఆల్ యువర్ ఫీట్" అంటూ పోస్ట్ చేశాడు.

అలాగే, మరో పోస్టులో "టైటానిక్ జేమ్స్ కెమరూన్ లెజెండ్ బోయపాటి శ్రీను కాళ్ళు పట్టుకుంటాడు. లెజెండ్ సినిమాకి ఇచ్చిన అవార్డుల మీద కాంట్రవర్సీ ఏంటో నాకు అర్థమవ్వట్లేదు.. అది కేవలం జెలసి ఉన్నవాళ్లు కాంట్రవర్సీ చేస్తున్నారు...నిజానికి జేమ్స్ కెమరూన్ గాని లెజెండ్ చూస్తే టైటానిక్ కి తన కొచ్చిన 11 ఆస్కార్ అవార్డుల్ని బోయపాటి శ్రీను కాళ్ళ దగ్గర పెట్టి సాష్టాంగ నమస్కారం పెడతాడు" అన్నాడు. మరి అగ్నికి ఆజ్యం పోసినట్టు ఇప్పటికే రగిలిపోతున్న వాళ్లకి వర్మ ఈ రకంగా ఇంకా మంటపెట్టాడు. మరి వర్మ ఇక్కడితోనే ఆగుతాడా.. లేక ఇంకా సెటైర్లు విసురుతాడో చూడాలి.