ఏపీ అసెంబ్లీ నిర్మాణం... వర్మ సూపర్ ఐడియా...

 

రామ్ గోపాల్ వర్మ... వివాదాలకు మారు పేరు ఈ పేరు. ఎక్కడ  ఏం జరిగినా నాకే కావాలంటూ.. ప్రతి దానిలో వేలు పెట్టి మరీ విమర్శలకు గురవుతుంటాడు. ఇప్పుడు తాజాగా ఏపీ అసెంబ్లీలో కూడా వేలు పెట్టాడు. ఆ అసెంబ్లీ నిర్మాణంలో సలహాలు కూడా ఇస్తున్నాడు. అమరావతిలో అసెంబ్లీ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కసరత్తులు చేస్తున్న సంగతి తెలిసిందే. అమరావతిలో అద్భుతమైన అసెంబ్లీని నిర్మించాలని చూస్తుంది. ఇప్పటికే ఈ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రభుత్వానికి అందించింది. అంతేకాదు ఈ డిజైన్లకు సంబంధించి... దర్శక దిగ్గజం రాజమౌళి సలహాలు కూడా తీసుకోవాలంటూ నార్మన్ సంస్థకు, సీఆర్డీఏ అధికారులకు సీఎం సూచించారు. ఇప్పుడు దీనిపై రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ఫేస్ బుక్ లో స్పందించారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి అసెంబ్లీని నిర్మించడం దండగ అని... ఏపీ ప్రభుత్వానికి ఒక గొప్ప సలహాను ఇస్తున్నానని... అసెంబ్లీ సమావేశాలను గ్రీన్ మ్యాట్ స్కీన్ ముందు నిర్వహించాలని... ఆ తర్వాత రాజమౌళి సహకారంతో గ్రాఫిక్స్ జతచేసి టెలికాస్ట్ చేస్తే అద్భుతంగా ఉంటుందని చెప్పారు. ఇలా చేస్తే మన అసెంబ్లీ ప్రపంచంలోని అన్ని అసెంబ్లీల కన్నా గొప్పగా ఉంటుందని అన్నారు. ఎందుకంటే ఇది 'బాహుబలియన్ అసెంబ్లీ' కాబట్టి అంటూ ముగించారు. మరి వర్మ ఇచ్చిన ఉచిత సలహాపై ఏపీ ప్రభుత్వం.. రాజమౌళి స్పందిస్తారో..? లేదో...?చూద్దాం.