TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు: మరో రెండు రోజుల పాటు వానలే వానలు.!

Published on: Sat Oct 31, 2026 10:34AM

ఉభయ తెలుగు రాష్ట్రాలలో వర్షాలు దంచి కొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి పశ్చిమ వాయివ్య దిశగా కదులుతుండటంతో, మరో రెండు మూడు రోజుల పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలలోని పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

ముఖ్యంగా  ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరకోస్తా జిల్లాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇప్పుడిప్పుడే అర్నాబ్ తుపాను సృష్టించిన విలయం నుంచి తేరుకుంటున్న ఆంధ్రప్రదేశ్ జనం మళ్లీ భారీ వర్షాల సమాచారంతో భయాందోళనలకు గురౌతున్నారు. అలాగే ఏపీలోని అన్నమయ్య, కృష్ణా, విజయనగరం, నంద్యాల  జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి.

ఇక తెలంగాణలోనూ వాతావరణం చల్లబడింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి.  భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, నల్గొండ, సంగారెడ్డి, సిద్దిపేట వికారాబాద్ జిల్లాల్లో రానున్న రెండు మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. లోతట్లు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప  ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు.  

[Rain Alert Telugu States, Andhra Pradesh, Telangana, IMD Weather Forecast, Heavy Rains, Coastal Andhra, Telangana Districts, Telugu One]