TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జంతర్ మంతర్ వద్ద నిరసన: రాహుల్ పిలుపు.. మళ్లీ ఉద్రిక్తంగా మారిన హస్తిన.!

Published on: Wed Oct 7, 2026 4:30PM

దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల సంఘం వ్యవహారంపై పొలిటికల్ టెన్షన్ అంతకంతకూ పెరుగుతోంది. కొనసాగుతోంది. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్)పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షాలు నిర్బంధాలు, నిషేధాలకు బెదిరేదే లే.. ఆందోళనలు కొనసాగించే విషయంలో తగ్గేదేలే అంటూ ముందుకు సాగుతున్నారు.

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించారు. మంగళవారం (అక్టోబర్ 6) ఈసీ కార్యాలయం వైపు చేపట్టిన మార్చ్‌ను పోలీసులు అడ్డుకోవడం, అనంతరం రాహుల్ గాంధీ సహా పలువురు నేతలను అదుపులోకి తీసుకోవడం తెలిపిందే. ఇప్పుడు తాజాగా జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు రాహుల్ గాంధీ పిలుపునివ్వడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ పరిణామాలు మరింత ఉత్కంఠకు దారితీశాయి. 

ఈ నేపథ్యంలోనే  నిర్దేశిత నిరసన స్థలమైన జంతర్ మంతర్‌కు వెళ్లాలని విపక్షాలు నిర్ణయించాయి. బుధవారం (సెప్టెంబర్ 7) రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. సుమారు 300 మంది ఎంపీలు ఈసీని కలవాలని ప్రయత్నించినా అవకాశం దక్కలేదన్నారు. అందుకే జంతర్ మంతర్‌లో నిరసన చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. 

సర్ ప్రక్రియ, ఓటర్ల జాబితాలో మార్పుల విషయంలో తగ్గేదేలే అంటున్న రాహుల్.. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయన్న రాహుల్ సహా ప్రతిపక్షాల విమర్శలను ఎన్నికల సంఘం, అధికార బీజేపీ ఖండిస్తున్నాయి. 

విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 

అదలా ఉంటే..  మంగళవారం (అక్టోబర్ 6) సాయంత్రం వరకు ఏ రాజకీయ పార్టీ కూడా తమను అధికారికంగా అపాయింట్‌మెంట్ కోరలేదని ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. అనంతరం రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఎంపీల బృందం ఈసీని కలవాలని కోరినట్లు పేర్కొంది. అయితే పార్లమెంట్ అనెక్స్‌లో సమావేశం నిర్వహించాలన్న ప్రతిపాదన తమ ప్రోటోకాల్‌కు అనుగుణంగా లేని కారణంగా రిజెక్ట్ చేశామని వివరణ ఇచ్చింది.  


[Rahul Gandhi Jantar Mantar Protest, Delhi Protest, CEC Gyanesh Kumar Resign Demand, Election Commission, SIR, INDIA, Telugu One]