TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎన్నికల సంఘం తప్పు చేస్తోంది: ఇది దేశద్రోహంతో సమానం.. రాహుల్ గాంధీ.!

Published on: Wed Sep 23, 2026 2:56PM

భారత రాజకీయాల్లో ఎన్నికల సంఘం,  ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తాజాగా కేంద్ర ఎన్నికల సంఘంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.   దేశంలో జరుగుతున్న ఓట్ల తొలగింపు,  ఎన్నికల ప్రక్రియ పారదర్శకతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు.  

ఎన్నికల సంఘం అధికారులు చేస్తున్న తప్పులు దేశద్రోహంతో సమానమని విమర్శలు గుప్పించారు. ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై వస్తున్న వరుస వార్తలు, నివేదికల నేపథ్యంలో రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు  సంచలనం సృష్టిస్తున్నాయి. ఎలక్టోరల్ రోల్స్,  ఓటర్ డేటా మానిప్యులైషన్ పై వస్తున్న ఆరోపణలు భారత ప్రజాస్వామ్య మూలాలనే దెబ్బతీస్తున్నాయని రాహుల్ గాంధీ  ఆందోళన వ్యక్తం చేశారు.

ఈసీఐ పై విమర్శలు, ఆరోపణలతో సోషల్ మీడియా వేదికగా రాహుల్ గాంధీ విడుదల చేసిన ఈ వీడియో  ప్రకంపనలు సృష్టిస్తోంది.  ఓట్ల చోరీదేశ  ప్రజలపై జరుగుతున్న పెద్ద నేరం, అలాగే భారత రాజ్యాంగంపై ప్రత్యక్ష దాడి అని ఆయన దుయ్యబట్టారు.  బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్,  ఎన్నికల సంఘం కలిసి ఈ వ్యవస్థీకృత తప్పులకు పాల్పడుతున్నాయని, ఇది ముమ్మాటికీ దేశద్రోహమేనని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ కుట్రలో భాగస్వామ్యులైన అధికారులు ఎవరూ చట్టం నుంచి తప్పించుకోలేరని  హెచ్చరించారు.  

ఎన్నికల సంఘం,  అధికారులచేస్తున్నది పూర్తిగా తప్పు..  ఇది దేశానికి వ్యతిరేకం, దేశద్రోహం అని రాహుల్ గాంధీ విమర్శించారు. సమయం వచ్చినప్పుడు ఎన్నికల సంఘం, ఎన్నికల సంఘం అధికారులూ చట్టం నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ తప్పించుకోలేరన్నారు.  ఎన్నికల సంఘం అంతర్గత వ్యవహారాల్లో విభేదాలు ఉన్నాయంటూ..  వచ్చిన  తాజా మీడియా నివేదికల నేపథ్యంలో రాహుల్ గాంధీ  చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన రాజ్యాంగ సంస్థలే నిష్పక్షికంగా  వ్యవహరించకపోతే దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.  


[Rahul Gandhi, Election Commission , Vote Chori, ECI controversy, Rahul Gandhi, Indian politics, Telugu One]