TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హైలో ఓపెన్ విజేత పీవీ సింధు: ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ మహిళా షట్లర్.!

Published on: Mon Nov 2, 2026 7:38AM

అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సర్క్యూట్‌లో  పీవీ సింధు సత్తా చాటింది. తెలుగుతేశం, ఒలింపిక్ పతకాల విజేత, ఇండియన్ స్టార్ షట్లర్ పీవీ సింధు భారత కీర్తి పతాకను అంతర్జాతీయంగా మరోసారి ఎగురవేశారు.  ప్రతిష్ఠాత్మక హైలో ఓపెన్-2026 బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా నిలిచిన పీవీ సింధు..  . ఈ విజయంతో ఈ సీజన్‌లో తన రెండో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్‌ను   తన ఖాతాలో వేసుకుంది. టోర్నమెంట్‌ ఆద్యంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన సింధు..  ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా దూసుకెళ్లింది.  జర్మనీ వేదికగా జరిగిన ప్రతిష్ఠాత్మక  ఓపెన్  బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో ఛాంపియన్‌గా నిలిచింది.  

ఆదివారం (నవంబర్ 1) జరిగిన ఫైనల్ లో పీవీ సింధు వరుస సెట్లలో  డెన్మార్క్‌ షట్లర్  లైన్ జార్స్‌ఫెల్డ్‌ను 21-12, 21-14 తేడాతో చిత్తుగా ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. ఈ టోర్నీ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ విమెన్ షట్లర్ గా సింధూ రికార్డు సృష్టించింది. హైలో ఓపెన్ టోర్నీలో గతంలో పురుషుల సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో భారత ఆటగాళ్లు గతంలో టైటిల్స్ సాధించినప్పటికీ.. మహిళల సింగిల్స్ ట్రోఫీని గెలుచుకోవడం మాత్రం ఇదే తొలిసారి.  ఈ అద్భుత విజయం సాధించిన పీవీ సింధూపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

 ఈ అపూర్వ విజయం సాధించిన పీవీ సింధును ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్   అభినందించారు. క్రీడా రంగంలో ఆమె సాధిస్తున్న వరుస విజయాలు తెలుగు ప్రజలకే కాకుండా యావద్దేశానికీ గర్వకారణమని ఎక్స్ వేదికగా అభినందించారు.     ఈ విజయంతో ఆమె ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవడంతో పాటు, రాబోయే పెద్ద టోర్నీలలో విజయాలకు అవసరమైన ఆత్మ విశ్వాసాన్ని ప్రోది చేసుకున్ట్లైంది.  


[PV Sindhu Win Hylo Open, 1st Indian Women Shutler, Nara Lokesh congratulates PV Sindhu, Indian Ace Shutler, Hylo Open Women Singles Winner]