TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో పసుపు నీళ్లతో శుద్ది.. ఏడుగురు అరెస్ట్..!

Published on: Tue Sep 15, 2026 11:00AM

మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు చెందిన ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిసరాల్లో చోటుచేసుకున్న ‘పసుపు నీళ్లతో శుద్ధి’ ఘటన ఇప్పుడు రాజకీయంగా చర్చనీ యాంశంగా మారింది. ఫామ్‌హౌస్‌కు దళితులు వచ్చిన అనంతరం రోడ్డును పసుపు నీళ్లతో శుద్ధి చేశారనే ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. అనంతరం పోలీసులు వరదరాజ్‌పూర్ గ్రామానికి చెందిన ఏడుగురు బీఆర్‌ఎస్ నాయకులను  అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా వీరిని విజయ వాడలో పోలీసులు అదుపులోకి తీసుకుని అనంతరం  కోర్టులో హాజరుపరచగా.. వారికి 15 రోజుల రిమాండ్ విధించింది. 

దీంతో అరెస్ట్ అయిన ఏడుగురిని సిద్దిపేట జైలుకు తరలిం చారు.  దళితులు ఎర్రవల్లిలోనికేసీఆర్ ఫామ్‌హౌస్ వద్దకు వచ్చారని బీఆర్ఎస్  నాయకులు ఫామ్‌హౌస్ పరిసరాల్లో పసుపు నీళ్లతో రోడ్డును శుద్ధి చేశారు. అయితే ఆ విధంగా దళితులు నిలబడిన  రోడ్డును శుద్ధి చేశారని కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం ఆరోపిస్తోంది. దీంతో వివాదం మొద లైంది..ఈ చర్య దళితు లను అవమానించే విధం గా ఉందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం మర్కుక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 

ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు వరదరాజ్‌పూర్ గ్రామానికి చెందిన ఏడు గురిపై దృష్టి సారించారు. విచారణలో భాగంగా వారిని విజయవాడలో పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయ స్థానం 15 రోజుల రిమాండ్ విధించడంతో ఏడుగురినీ సిద్దిపేట జైలుకు తరలిం చారు.ఈ అరెస్టులతో ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిసరాల్లో జరిగిన ఘటనపై పోలీసుల దర్యాప్తు మరింత కీలక దశకు చేరుకుంది. మరో వైపు ఘటనకు సంబంధిం చిన ఆధారాలను సేకరిం చేందుకు పోలీసులు ఇప్పటికే ఫామ్‌హౌస్ పరిసరాల్లో ఫోరెన్సిక్ బృందంతో పరిశీలన నిర్వహించారు. 

ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ లభించిన ఆధారాలను సేకరించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నా మని, దర్యాప్తు కొనసాగు తోందని పోలీసులు వెల్లడించారు. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిసరాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న ఈ ఘటన ఇప్పుడు రాజకీయంగా  బాగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవైపు దళితులను అవమానించారంటూ కాంగ్రెస్ దళిత విభాగం ఆరోపిస్తుండగా.. మరో వైపు ఈ వ్యవహారంలో బీఆర్‌ఎస్ నాయకుల అరెస్టులు జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది.

 

 

 

[ Purification with turmeric water at Erravalli farmhouse, KCR, KTR, BRS Party, Siddipet Jail, Congress party, CM Revanth reddy, Telugu One, Telugu News ]