TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆడబిడ్డ పుట్టిన 24 గంటల్లోనే రూ.1.5 కోట్ల లాటరీ.. నిజంగా ఆ ఇంటి మహాలక్ష్మే.!

Published on: Thu Nov 12, 2026 8:37PM

ఇంట్లో ఆడపిల్ల జన్మిస్తే ఆ ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టేనని పెద్దలు అంటారు. పంజాబ్‌లో చోటుచేసుకున్న ఒక అరుదైన ఘటన ఈ నానుడిని అక్షరాలా నిజం చేసింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఒక పేద కుటుంబానికి, పుట్టిన పసిపాప అదృష్టాన్ని మోసుకొచ్చింది. చిన్నారి వెలుగు చూసిన ఒక్క రోజూ తిరగకముందే ఆ తండ్రిని కోట్లలో సంపద వరించింది.

పంజాబ్‌లోని మాన్సా జిల్లా బరేటా ప్రాంతానికి చెందిన యుధ్‌వీర్ సింగ్ వడ్రంగి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజువారీ సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న అతనికి, ఇల్లు కట్టే క్రమంలో చేసిన అప్పులు పెరిగిపోయాయి. భార్య హర్మన్ కౌర్ గర్భవతిగా ఉన్న సమయంలో కుటుంబ పోషణ భారం మరింత భారంగా మారింది.

ఈ తరుణంలో నవంబర్ 4న భార్యను ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో మార్గమధ్యంలో ఒక లాటరీ స్టాల్ కనిపించింది. భార్య వారించినప్పటికీ, ఆమె పేరు మీదే రూ. 200 పెట్టి ఒక ‘పంజాబ్ స్టేట్ డియర్ 200 మంత్లీ’ లాటరీ టికెట్‌ను యుధ్‌వీర్ కొనుగోలు చేశాడు. జీవితంలో తొలిసారి అతను ఈ ప్రయోగం చేయడం విశేషం.

ఆ తర్వాత నవంబర్ 6న హర్మన్ కౌర్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇంట్లో సిరిమల్లె లాంటి పాప అడుగుపెట్టడంతో ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే, ఆ సంతోషం మరవకముందే మరుసటి రోజు అనగా నవంబర్ 7న వచ్చిన లాటరీ ఫలితాలు ఆ కుటుంబాన్ని నివ్వెరపరిచాయి.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌ పోలీస్‌ బాస్‌ మార్పు.. సజ్జనార్‌ స్థానంలో మహేశ్‌ భగవత్‌.!

యుధ్‌వీర్ కొన్న ఆ ఒక్క లాటరీ టికెట్‌కు నంబర్ వన్ ప్రైజ్ తగిలింది. ఏకంగా రూ. 1.5 కోట్ల భారీ బహుమతి ఆ కుటుంబం సొంతమైంది. బిడ్డ పుట్టిన 24 గంటలు కూడా గడవకముందే కోటీశ్వరులు కావడంతో బంధుమిత్రులు సైతం ఆశ్చర్యపోతున్నారు. తమ ఇంటికి సాక్షాత్తు మహాలక్ష్మి రూపంలో కూతురు వచ్చిందని భావించి ఆ దంపతులు చిన్నారికి ‘బర్కత్’ అని నామకరణం చేశారు.

ఈ అనూహ్య పరిణామంపై యుధ్‌వీర్ స్పందిస్తూ.. దేవుడు తమ కష్టాలను కనుమరులు చేసేందుకే బిడ్డ రూపంలో ఈ అదృష్టాన్ని ప్రసాదించాడని ఆనందం వ్యక్తం చేశాడు. వచ్చిన డబ్బుతో ముందుగా అప్పులన్నీ తీర్చేస్తానని, మిగిలిన మొత్తాన్ని కూతురి భవిష్యత్తు కోసం పక్కాగా పెట్టుబడి పెడతానని తెలిపాడు.

నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆ చిన్నారి పుట్టుకతోనే ఇంట సంపదను నింపడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ అరుదైన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతుండటంతో ఆ కుటుంబానికి అందరూ అభినందనలు తెలుపుతున్నారు. భవిష్యత్తులో ఆ పాప ఉన్నత చదువులు చదివి కుటుంబానికి మరింత పేరు తెస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మీకు నచ్చవచ్చు: NVIDIA సీఈవో పదవికి జెన్సన్ హువాంగ్ రాజీనామా.. అసలు కారణం ఇదేనా.!

మీకు నచ్చవచ్చు: ఏపీకి కియా భారీ పెట్టుబడులు.. పెనుకొండలో మరో ప్లాంట్.!

 

 

[ Punjab State Dear Lottery, Mansa Bareta Punjab, Carpenter wins lottery, Punjab lottery winner,
15 crore lottery jackpot ]