TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ కోట బద్దలు.. పులివెందులలో టీడీపీ చారిత్రక విజయం.!

Published on: Tue Nov 3, 2026 5:02PM

20 వార్డుల్లో 17 స్థానాలు గెలుపు.!

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌కు కంచుకోటగా భావించే పులివెందులలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. దశాబ్దాలుగా వైఎస్‌ కుటుంబానికి పట్టున్న పులివెందుల మున్సిపాలిటీలో టీడీపీ కూటమి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. దీంతో పులివెందుల రాజకీయాల్లో ఈ ఫలితం చర్చనీయాంశంగా మారింది.

మున్సిపల్ చైర్మన్ స్థానానికి జరిగిన పోరులో టీడీపీ అభ్యర్థి తూగుట్ల గీత ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వైఎస్‌ ప్రమీలమ్మపై ఏకంగా 13,875 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచే టీడీపీ అభ్యర్థి ఆధిక్యం ప్రదర్శించగా, చివరకు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.

20 వార్డుల్లో కూటమి హవా.. 17 స్థానాలు కైవసం.!

మున్సిపల్ చైర్మన్ పీఠంతో పాటు వార్డుల్లోనూ టీడీపీ కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మొత్తం 20 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు 17 స్థానాల్లో విజయం సాధించారు.
- టీడీపీ – 15 వార్డులు
- జనసేన – 1 వార్డు
- బీజేపీ – 1 వార్డు
- వైఎస్సార్‌సీపీ – 3 వార్డులు

దీంతో వైఎస్సార్‌సీపీ కేవలం మూడు వార్డులకే పరిమితమైంది. పులివెందులలో టీడీపీ కూటమి సాధించిన ఈ విజయం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ సొంత నియోజకవర్గంలోనే మున్సిపల్ పీఠాన్ని కోల్పోవడం వైఎస్సార్‌సీపీకి రాజకీయంగా కీలక పరిణామంగా మారింది.మొత్తంగా పులివెందుల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు స్థానిక రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి.

 

 

[ Pulivendula Results, TDP Victory, Jagan, Tugutla Geetha, Pulivendula Municipality, YSRCP, AP Municipal Elections, TDP Alliance, Pulivendula Results, TDP, Geetha Kumari, YSRCP, AP Municipal Elections, Counting Results, Chandrababu Naidu, Jagan Mohan Reddy ]