ఎస్కార్ట్ నంటూ నీడలా వెంబడించి: చెవిరెడ్డికి చెమటలు పట్టించి, చుక్కలు చూపించిన సుధారెడ్డి.!
Published on: Thu Nov 5, 2026 2:04PM

జగన్ హయాంలో చెవిరెడ్డి నుంచుంటే మాస్, కూర్చుంటే మాస్ అన్నట్లుగా ఉండేది పరిస్థితి. చంద్రగిరి నియోజకవర్గంలో ఏకపక్ష అరాచకాలు, బెదిరింపు రాజకీయాలతో చెలరేగిపోయేవారు. అటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి.. పరిషత్ పోలింగ్ వేళ చుక్కలు చూపించారు పులవర్తి నాని సతీమణి పులవర్తి సుధారెడ్డి. . పోలింగ్ కేంద్రాల వద్ద అలజడులు సృష్టించి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసే చెవిరెడ్డిని చేతులు కట్టుకుని మౌనమునిలా మారిపోయేలా చేశారు. చెవిరెడ్డి తన పాత పద్ధతులతో పరిషత్ ఎన్నికలలో గలాటా సృష్టించి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసేందుకు చేసిన ప్రయత్నాలను భగ్నం చేశారు సుధారెడ్డి. మైకుల ముందూ, తన అనుచరుల ముందూ వీరావేశం ప్రదర్శించే చెవిరెడ్డి ఎదుట నేరుగా నిలబడిన సుధారెడ్డి ధైర్యం ముందు చెవిరెడ్డి తలవంచుకు నిలబడిపోయారు.
మంగళం పోలింగ్ బూత్ వద్ద ఎదురుపడిన చెవిరెడ్డిని ఉద్దేశించి సుధారెడ్డి ఇద్దరం ఒకే కారులో కూర్చుని అన్ని బూత్‌లకు వెళ్దాం అంటూ సవాల్ విసిరారు. అయితే ఆ సవాల్ ను స్వీకరించే ధైర్యం లేక చెవిరెడ్డి తలదించుకున్నారు.
అక్కడ నుంచి జారుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రయత్నాన్ని కూడా సుధారెడ్డి అడ్డుకున్నారు. ఇక్కడ నుంచి మరో పోలింగ్ బూత్ కు వెళ్లి అక్కడ గలాటా సృష్టిస్తారా అని నిలదీస్తూ సుధారెడ్డి తన కాన్వాయ్ లో చెవిరెడ్డి వెనుకే బయలుదేరారు. చెవిరెడ్డి ఏ ఊరికి వెళ్తే మనం ఆ ఊరికే వెళ్దాం.. ఆయన ఎక్కడ అడుగుపెడితే మనం కూడా అక్కడే దిగుదాం అంటూ చెవిరెడ్డిని నీడలా వెంటాడి ఆయనను కట్టడి చేశారు. ఆయన వేసే ప్రతి అడుగునూ కట్టడి చేస్తూ సుధారెడ్డి చూపించిన ఈ తెగువతో చెవిరెడ్డి అనుచర వర్గం వణికిపోయింది.
ఒక విధంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి, అదే నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఎస్కార్ట్ గా మారారు. ఆయన ఎటు వెడితే అటే వెడుతూ చెవిరెడ్డికి చెమటలు పట్టించారు. చుక్కలు చూపించారు. చెవిరెడ్డి అన్న వెంటే ఉంటానంటూ ఆయన ఎక్కడక వెడితే అక్కడికి వెళ్లారు. ఎక్కడ నిలబడితే అక్కడే ఆయన పక్కనే నిలబడ్డారు. చెవిరెడ్డి అన్నకు కుర్చీ వేయండంటూ మర్యాదలూ చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా సాగాలంటే ముందు చెవిరెడ్డిని నియంత్రించాల్సిన అవసరం ఉందనీ, అందుకే ఆయనతోనే ఉంటానంటూ చెవిరెడ్డిని ఫాలో అయ్యారు. ఈ పరిణామం చెవిరెడ్డి చేతులూ కాళ్లూ కట్టేసినట్లైంది.
సుధారెడ్డి పోలీసులను వారి డ్యూటీ వారిని చేయమని సూచిస్తూనే తాను చెవిరెడ్డితోనే పోలింగ్ సరళిని పరిశీలిస్తానంటూ ఆయననే వెంబడించారు. ఈ పరిణామంతో చెవిరెడ్డికి చెమటలు పట్టాయి. అక్కడ నుంచి వెళ్లిపోలేక, ఉండలేక చేతులు కట్టుకుని బిక్కముఖం వేసుకుని అక్కడక్కడే తచ్చాడటం కనిపించింది. తాను చెవిరెడ్డిని ఫాలో కావడానికి కారణాన్ని సుధారెడ్డి వివరించారు. ఉదయమే ఓ పోలింగ్ బూత్ వద్ద చెవిరెడ్డి గలాటా సృష్టించడానికి ప్రయత్నించారని సుధారెడ్డి ఆరోపించారు.

ఆయన నైజమే అదన్న సుధారెడ్డి.. గలాటా సృష్టించి, ఉద్దేశపూర్వకంగా గొడవలను ప్రేరేపించి.. ఆ వీడియోలను ఎన్నికల సంఘానికి పంపి అక్రమాలు అంటూ ఫిర్యాదు చేస్తుంటారని అన్నారు. మునిసిపల్ ఎన్నికల సమయంలోనూ ఇదే చేశారని ఆమె వివరించారు. అందుకే అటువంటి పరిస్థితి రాకుండా, చెవిరెడ్డికి గలాటా సృష్టించే అవకాశం ఇవ్వకుండా తానే ఆయనకు ఎస్కార్ట్ గా మారానన్న సుధారెడ్డి, ప్రజలు ప్రశాంతంగా ఓటు వేయాలని విజ్ణప్తి చేశారు. సుధారాణి దూకుడుతో చెవిరెడ్డి కుదేలయ్యారు. భయపడ్డారో, ఇంకా అక్కడే ఉంటే ఆబోరు దక్కదనుకున్నారో ఏమో సైలెంట్ గా సైడైపోయారు.
[Pulivathi Sudharedd Escort Chevireddy, Parishat Elections, Chandragiri, AP Local Elections, Mangalam Polling Booth, TeluguOne]


