IPL దెబ్బకు PSL షాకింగ్ నిర్ణయం: జనవరి 2027కి పాకిస్తాన్ లీగ్ మార్పు?
Published on: Mon Sep 7, 2026 11:44AM

ప్రపంచంలోనే అతిపెద్ద టీ20 లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)తో పోటీపడటం ఎంత కష్టమో పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) నిర్వాహకులకు మరోసారి స్పష్టమైంది. ఐపీఎల్ దెబ్బకు కోట్లాది రూపాయల ప్రకటనల ఆదాయం కోల్పోతున్న పిఎస్ఎల్, ఇప్పుడు తన షెడ్యూల్‌ను పూర్తిగా మార్చుకోవడానికి సిద్ధమవుతోంది. 2026 సెప్టెంబర్ 1న లండన్‌లో జరిగిన పిఎస్ఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు ఒక కీలక ప్రతిపాదన తెరపైకి వచ్చింది. 2027 నాటి పిఎస్ఎల్ తదుపరి ఎడిషన్‌ను ఏప్రిల్-మే విండో నుండి విడదీసి, జనవరి-ఫిబ్రవరి నెలల్లోనే నిర్వహించాలని తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఐపీఎల్ జరిగే సమయంలో టెలివిజన్ రేటింగ్స్, స్పాన్సర్‌షిప్‌లు దారుణంగా పడిపోతుండటమే ఈ కీలక నిర్ణయానికి ప్రధాన కారణం.
నిజానికి 2016లో ప్రారంభమైన నాటి నుంచి పిఎస్ఎల్ పోటీలు ప్రతి ఏటా ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లోనే విజయవంతంగా సాగేవి. అయితే 2025 మరియు 2026 సంవత్సరాల్లో ఐసీసీ అంతర్జాతీయ టోర్నీల షెడ్యూల్ కారణంగా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తప్పనిసరి పరిస్థితుల్లో పిఎస్ఎల్ ను ఏప్రిల్-మే విండోకి మార్చాల్సి వచ్చింది. అదే సమయంలో భారత్‌లో ఐపీఎల్ ఉధృతంగా సాగుతుండటంతో పిఎస్ఎల్ లీగ్‌కు రావాల్సిన ఆదరణ, ప్రకటనల ఆదాయం భారీగా క్షీణించాయి. ఈ తీవ్ర ఆర్థిక లోటుపై పిఎస్ఎల్ మీడియా హక్కుల భాగస్వామి అయిన వాలీ టెక్నాలజీస్ (Walee Technologies) గవర్నింగ్ కౌన్సిల్ ముందు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఐపీఎల్ నడుస్తున్న ఏప్రిల్-మే సమయంలో వాణిజ్య ప్రకటనల ద్వారా ఆదాయం రాబట్టడం దాదాపు అసాధ్యంగా మారిందని స్పష్టం చేసింది.
ఈ బ్రాడ్‌కాస్టర్ సంస్థకు పిఎస్ఎల్ దేశీయ ప్రసార మరియు డిజిటల్ హక్కులు 2029 వరకు ఉన్నాయి. అంతేకాకుండా 2026 ఎడిషన్ అంతర్జాతీయ మీడియా హక్కులు కూడా వీరి వద్దే ఉన్నాయి. ఈ సంవత్సరం పిఎస్ఎల్ జట్ల సంఖ్య 6 నుండి 8కి విస్తరించినప్పుడు కొత్తగా వచ్చిన రావుల్పిండిజ్ ఫ్రాంచైజీ యజమానులు కూడా ఈ సంస్థే కావడం గమనార్హం. ప్రస్తుతం ఉన్న సెంట్రల్ రెవెన్యూ పూల్ ఒప్పందం ప్రకారం బ్రాడ్‌కాస్ట్ ఆదాయంలో ఏకంగా 95 శాతం వాటా 8 ఫ్రాంచైజీలకే దక్కుతుంది. ಆದಾಯం తగ్గిపోతుండటం, అలాగే అన్ని ఫార్మాట్లలో పాకిస్తాన్ జాతీయ జట్టు వరుస వైఫల్యాల వల్ల లీగ్‌పై అభిమానుల ఆసక్తి సన్నగిల్లడం ఫ్రాంచైజీ యజమానులను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది.
ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి పిసిబి మరియు ఫ్రాంచైజీ యజమానులు సరికొత్త ప్రణాళికలను రచిస్తున్నారు. అందులో భాగంగా జనవరి ప్రారంభంలో కరాచీ వేదికగా టోర్నీని మొదలుపెట్టాలని భావిస్తున్నారు. ఎందుకంటే ఆ సమయంలో పంజాబ్, పెషావర్ ప్రాంతాలలో తీవ్రమైన చలి ఉంటుంది, కానీ కరాచీలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. టోర్నీ ముందుకు సాగుతున్న కొద్దీ చలి తీవ్రత తగ్గాక మ్యాచ్‌లను మిగిలిన నగరాలకు తరలించేలా ముసాయిదా సిద్ధం చేశారు. ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు నవంబర్ మధ్య నుండి మార్చి వరకు ఎటువంటి అంతర్జాతీయ ద్వైపాక్షిక సిరీస్‌లు లేకపోవడం లీగ్‌కు పెద్ద కలసివచ్చే అంశం.
psl rescheduled to avoid ipl clash,psl 2027 new schedule january window.


