TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నిరసనలతో దద్దరిల్లుతున్న జంతర్ మంతర్.!

Published on: Sat Aug 22, 2026 10:41AM

జంతర్ మంతర్ మళ్లీ రణరంగంగా మారింది. ఇటీవల నీట్ లీకేజ్ కు నిరసనగా బొద్దింకల పార్టీ ఆధ్వర్యంలో జెన్ జీ,  విద్యార్థుల ఆందోళనలతో అట్టుడికిన జంతర్ మంతర్ ఇప్పుడు మరో సారి ఆందోళనలకువేదికగా మారింది. ఈ  సారి నిరసన కారులు..  దేశంలో అమలవుతున్న రిజర్వేషన్ల విధానంలో  సంస్కరణలు తీసుకురావాలనీ,   ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం దుర్వినియోగాన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూఆందోళనకు దిగారు.

వేలాది మంది  నిరసనకారులు తమ డిమాండ్ల సాధన కోసం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రిజర్వేషన్ల పరిధిని నిరంతరం విస్తరించడం వల్ల ఎదురవుతున్న సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా రిజర్వేషన్లపై  సమీక్ష జరగాలని, చట్టాల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలని   డిమాండ్ చేశారు.  

కాగా ఈ ఆందోళన నేపథ్యంలో  ఢిల్లీ పోలీసులు,  ఇతర భద్రతా బలగాలు భారీగా మోహరించాయి.   ఆందోళనకారులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది.  దీంతో  పోలీసులు పలువురు నిరసనకారులను అదుపులోకి తీసుకుని అక్కడ నుంచి తరలించారు. ఈ సందర్భంగా జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల నీట్ పరీక్షల వివాదం, విద్యా   సమస్యలపై విద్యార్థులు ఇక్కడ నిర్వహించిన పోరాటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఇప్పుడు కుల ఆధారిత రిజర్వేషన్లు,  చట్టాల   అంశంపై పెద్ద ఎత్తున నిరసనలు మొదలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. విద్యార్థుల అంశం కంటే రిజర్వేషన్ల అంశం విస్తృతమైనది కావడంతో ఇది  తీవ్ర రూపాన్ని దాల్చే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   

Protests at Jantarmantar again, Jantar Mantar protests, Delhi Police arrests, reservation reforms, misuse of the SCST Act