Latest News

రితేష్ రెడ్డి గన్ లైసెన్స్ రద్దు చేయాలని సీపీకి సిట్ లేఖ

posted on: Mar 17, 2026 5:32PM

 

పైలెట్ రోహిత్ రెడ్డి వ్యవహారం రోజురోజుకు మరింత సంచలనంగా మారుతోంది. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక నిర్ణయాలు తీసుకుం టోంది. రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి గన్ లైసెన్స్‌ను రద్దు చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు సిట్ అధికారులు లేఖ రాశారు. రితేష్ రెడ్డికి 2017లో సైబరాబాద్ పోలీసులు గన్ లైసెన్స్ జారీ చేశారు. అయితే ఇటీవల జరిగిన పరిణామాల్లో రివాల్వర్‌ను దుర్వినియోగం చేసినట్లు సిట్ గుర్తించింది. దీంతో ఆయుధం వినియోగంపై నిబంధనలు ఉల్లంఘించి నందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని, గన్ లైసెన్స్ రద్దు చేయాలని సీపీకి సిఫారసు చేసింది. 

ఇదిలా ఉండగా, పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ వ్యవహారం కూడా సిట్ దృష్టిలోకి వచ్చింది. రంగా రెడ్డి జిల్లా మొయినాబాద్ పరిధిలోని ఈ ఫామ్ హౌస్ అక్రమ కార్యకలాపాలకు అడ్డాగా మారినట్లు అధికారులు నిర్ధారించినట్లు సమాచారం. ముఖ్యంగా అసాంఘిక కార్యకలాపాలు, అనుమానాస్పద సమా వేశాలు ఇక్కడ నిర్వహిం చబడుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫామ్ హౌస్‌ను సీజ్ చేయడానికి అధికారులు చర్యలు ప్రారంభించారు. దీనికి సంబంధించి రెవెన్యూ అధికారులకు పోలీసులు ఇప్పటికే లేఖ రాసినట్లు తెలిసింది. చట్టపరమైన ప్రక్రియల అనంతరం త్వరలోనే సీజ్ చర్యలు చేపట్టే అవకాశం ఉందని వర్గాలు వెల్లడిస్తున్నాయి. మొత్తంగా ఈ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతమవు తుండగా, రాబోయే రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశ ముంది. అక్రమ కార్యకలా పాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికా రులు స్పష్టం చేస్తున్నారు.


 

google-ad-img
    Related Sigment News
    • Loading...