Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...18 ఏళ్ళలో 30 ట్రాన్స్ఫర్‌లు... కాకరేపుతున్న సీఐ శ్రీరామ్ బదిలీ
posted on: Jan 30, 2026 8:35PM

వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో ఖాకిపై ఖద్దరు వేటు ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ వేటులో సీఐ శ్రీరామ్ బదిలీ కావడంతో పోలీస్ శాఖలో తీవ్ర చర్చలు తావిస్తుంది. ఒక నిజాయితీ యువ పోలీసు అధికారి రాజకీయ బదిలీకి గురికావడం పోలీస్ పవర్ పై రాజకీయ ప్రభావం బాగా కనిపిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసోడు ట్రాన్ ఫర్ అయితే పోలీస్ స్టేషన్ కి వెళతాడు కానీ పోస్ట్ ఆఫీస్ కాదు అనే డైలాగ్ విక్రమార్కుడు సినిమాలో హైలెట్ డైలాగ్ ఇప్పటికీ మనకు గుర్తుండిపోతుంది. కానీ ప్రొద్దుటూరు ప్రజల నోట ఇదే డైలాగ్ మరోమారు రిపీట్ కావడంతో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది.
సరిగ్గా 40 రోజుల క్రితం ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు బదిలీపై వచ్చిన సీఐ శ్రీరామ్ కొద్ది రోజుల వ్యవధిలోనే ఆయన ప్రజా మార్క్ చూపించడంతో స్థానిక ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రొద్దుటూరు ప్రాంతానికి సమర్ధుడైన పోలీసులు ఆఫీసర్ వచ్చారు.. తమ ప్రజా సమస్యలపై ప్రశాంతంగా ఉంటామని అనుకున్నారు.
దీంతో ప్రొద్దుటూరు లో ఆ పోలీస్ అధికారి దూకుడుగా మారి మట్కా, గుట్కా, క్రికెట్ బెట్టింగ్ లాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిని నేరుగా పోలీసు స్టేషన్ కు పిలిపించి తన మార్క్ కౌన్సెలింగ్ ఇచ్చాడు. కేవలం 40 రోజుల కాల వ్యవధిలొనే పోలీస్ ఉన్నతాధికారులు సిఐ శ్రీరామ్ పై బదిలీ వేటు వేయడంతో ప్రొద్దుటూరు ప్రజల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. నిజాయితీపరుడైన ఆ యువ పోలీసు అధికారి పైన రాజకీయ శక్తులు వేటు వేసాయని ప్రొద్దుటూరులో చర్చ జరుగుతోంది .
*అసాంఘిక శక్తుల ఆటకట్టించే క్రమంలో
తన మన తేడా లేకుండా చట్టం ముందు అందరూ సమానులేనని రౌడీషీటర్లను సైతం స్టేషన్ ముందు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మట్కా గుట్కా జూదం క్రికెట్ బెట్టింగ్ పలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేసి ప్రొద్దుటూరు ప్రజల మన్ననలు పొందాడు. ఈ సంఘటన స్థానిక రాజకీయ నేతలకు మింగుడు పడకపోవడంతో ట్రాన్స్ఫర్ ఆర్డర్ తో శ్రీరామ్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశారని తెలుస్తోంది.
ప్రొద్దుటూరులోని వన్ టౌన్ పరిధిలో బ్రాందీ షాపులు తెరిచే సమయ పాలనను ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా చేస్తే చర్యలు తప్పవని సీఐ శ్రీరామ్ బాహాటంగా చెప్పారు. తన పరిధిలోని ప్రదేశాలలో బహిరంగంగా మద్యం సేవిస్తే ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు. మద్యం షాప్ యజమానులకైతే సమయపాలన పాటించకపోతే నేను పోలీసోడినని చెప్పి మరి హెచ్చరించడం జరిగింది.
ఓ బ్రాందీ షాప్ నిబంధనలకు విరుద్ధంగా ఓపెన్ చేయడంతో వారిపై పోలీసు లాఠీ జలుపించాడు సీఐ శ్రీరామ్. దీనితో అధికార పార్టీకి సంబంధించిన రాజకీయ నేతలు అతనిని ట్రాన్స్ఫర్ చేయాలని తీవ్ర ఒత్తిడి చేసినట్టు ఆరోపణలు వినిపించాయి. తన స్టేషన్ పరిధిలో బాధితులకు సత్వర న్యాయం అందించి న్యాయం వైపు నిలబడి సమస్య పరిష్కరించే వాడని సిఐ శ్రీ రామ్ పై ప్రొద్దుటూరు ప్రజలు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.
*18 ఏళ్ళలో 30 బదిలీలు
సీఐ శ్రీరామ్ పోలీస్ సర్వీస్ లేకొచ్చిన 18 ఏళ్ళలో 30 సార్లు ట్రాన్స్ఫర్ కావడం ఆయన ముక్కు సూటి తనానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 2007లో పోలీస్ శాఖలో ఎస్సైగా చేరి కందుకూరు, పుట్టపర్తి, రాయదుర్గం, కళ్యాణదుర్గం, కనగాని పల్లె బెలుగుప్ప, ధర్మవరం, పెద్ద వడగూరు, అనంతపురంలతో పాటు పలు ప్రాంతాల్లో పని చేశారు. తర్వాత అనంతపురం, హిందూపురం, మడకశిర, ఆదోని కర్నూలు కాళహస్తి, పొద్దుటూరులో పనిచేసి ఇప్పుడు తాజాగా మరో సారి బదిలీ అయ్యారు.



.webp)


