KCRను: గుర్తు చేసేలా ప్రియదర్శి నటన.. ‘శంకరన్న’పై హరీశ్ రావు ప్రశంసల వర్షం.!
Published on: Wed Sep 30, 2026 4:24PM
.webp)
‘ది ప్యారడైజ్’ సినిమాలో ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో మాజీ సీఎం కేసీఆర్‌ను పోలిన పాత్రను పోషిస్తున్న నటుడు ప్రియదర్శిని మాజీ మంత్రి హరీశ్ రావు కలిసి అభినందించారు. ప్రియదర్శిని శాలువాతో సత్కరించిన హరీశ్ రావు.. అనంతరం ఆయనతో చాలాసేపు ముచ్చటించారు. సినిమా, శంకరన్న పాత్రకు సంబంధించిన పలు అంశాలపై ప్రియదర్శితో చర్చించారు.అనంతరం హరీశ్ రావు ‘ఎక్స్’ వేదికగా ప్రియదర్శి నటనపై ప్రశంసలు కురిపించారు.
‘బలగం’, ‘మల్లేశం’ సినిమాలతో ప్రియదర్శి తనదైన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ‘ది ప్యారడైజ్’లో శంకరన్నగా ఆయన పలికిన తెలంగాణ యాస, మేనరిజమ్స్, స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు.ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్‌ను గుర్తు చేసేలా ప్రియదర్శి చూపించిన హావభావాలు, డైలాగ్ డెలివరీ ఆకట్టుకునేలా ఉన్నాయని హరీశ్ రావు పేర్కొన్నారు. సినిమాలోని “చావు నోట్లో తల పెట్టయినా… మీకు గుర్తింపు తెస్తా!!” అనే డైలాగ్‌ను ప్రస్తావిస్తూ.. ప్రియదర్శి నటనను ప్రశంసించారు.
.webp)
అలాగే ‘ది ప్యారడైజ్’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, హీరో నాని, చిత్ర బృందానికి హరీశ్ రావు అభినందనలు తెలిపారు. ప్రియదర్శి భవిష్యత్తులో మరిన్ని గుర్తుండిపోయే పాత్రలు పోషిస్తూ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఇప్పటికే ‘బలగం’లో తన సహజ నటనతో ప్రేక్షకులను మెప్పించిన ప్రియదర్శి.. ది ప్యారడైజ్’లో శంకరన్న పాత్రతో మరోసారి అలరించారు. మరిన్ని సినిమాల్లో కేసీఆర్ పాత్రలో ప్రియదర్శి కనిపించబోతున్నారన్న టాక్.
[ Priyadarshi, Harish Rao, The Paradise, Shankaranna, KCR, Nani, Sreekanth Odela, Telangana Cinema, Priyadarshi The Paradise, Telugu Movies, Harish Rao X Post, The Paradise Movie, Telugu One, Telugu News ]


