పంచెకట్టులో అర్జున తపస్సు ప్రదేశాన్ని జిన్ పింగ్ కు వివరించిన మోదీ

 

తమిళనాడు లోని మహాబలిపురం లో అర్జున తపస్సు ప్రదేశాన్ని విశిష్ట అతిథి జిన్ పింగ్ కు మోదీ వివరించారు. ప్రతి స్తంభాన్ని శిల్ప సంపదను జిన్ పింగ్ కు చాలా ఆత్మీయంగా మోదీ వివరించారు. రెండు అగ్ర దేశాధినేతల ఆత్మీయ సమావేశాన్ని ప్రపంచం అంతా చాలా ఆసక్తికరంగా చూస్తోంది. ఇరుదేశాధినేతల ఈ సమావేసం భవిష్యత్ శుభ పరిణామానికి నాందిగా ప్రపంచ విశ్లేషకులు భావిస్తున్నారు. స్నేహ హస్తాన్ని అందించటంలో మోదీ స్టైలే వేరు, అందరి కంటే ఒకడుగు ముందుకు వేసే ఊహించని రీతిలో ఆయన స్నేహా స్వభావం ఉంటుంది.

భారతదేశ సంప్రదాయ వస్త్రధారణ నేటి తమిళనాడు తెలుగు రాష్ట్రాల్లోని సంప్రదాయ వస్త్రధారణ పంచెకట్టులో దర్శనమిస్తూ ఓ అతిపెద్ద దేశాధినేతకు మహాబలిపురంలోని ఆలయాన్ని వివరించారు. ఆలయాలపై ఉన్న శిల్పా సంపదను మోదీ ప్రత్యేకంగా వివరించారు. శిల్ప సంపదకు పుట్టినిల్లు భారతదేశం అద్భుతమైన శిల్పాలు మనకి దర్శనమిస్తూ ఉంటాయి. తమిళనాడు మహాబలిపురంలో అర్జున తపస్సు ప్రదేశం తో చైనాకు భారతదేశాని కి అవినాభావ సంబంధముంది.

ఇక్కడ నుంచి వాణిజ్య సంబంధాలను నెరిపేవారు, అందులో భాగంగానే మోదీ విదేశాంగ విధానంతో పాటు దక్షిణ భారతదేశంలో తమిళనాడుని ఆతిథ్య ప్రదేశంగా ఎంచుకోవడంలో ఆయన ఆలోచనే వేరు. పంచెకట్టులో రాజసంగా మోదీ నడుచుకుంటూ వెళుతుంటే పక్కనే మరో అగ్రదేశాధినేత ఆయనతో మాట్లాడుకుంటూ వస్తూ ఉంటే ఈ స్నేహం ఎటువంటి శుభ పరిణామాలకు దారి తీయబోతోందని ప్రపంచం చర్చించుకుంటోంది. కానీ, పాకిస్థాన్ మాత్రం ఏం జరుగుతుందో అని కంటవిప్పుతో చూస్తూ ఉంటుంది.