రాఖీ కట్టిన వ్యక్తితోనే ప్రేమ, పెళ్లి: కూతురికి పాడె కట్టి, పిండం పెట్టిన తండ్రి.!
Published on: Thu Oct 1, 2026 2:21PM

పదిహేనేళ్ల పరిచయం. ఏటా రాఖీ కట్టి అన్నా అని పిలిచేది. వారిద్దరిదీ అన్నా చెల్లెళ్ల బంధం అని కుటుంబ సభ్యులు కూడా సంబరపడ్డారు. అయితే దశాబ్దంన్నరగా అన్నాఅని పిలిచిన ఆ వ్యక్తినే ప్రేమించాననీ పెళ్లి చేసుకుందా యువతి. ఇది నచ్చని ఆ యువతి తండ్రి ఏం చేశాడో తెలుసా? అది తెలుసుకోవాలంటే.. ప్రయాగ్‌రాజ్‌లోని యమునానగర్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల నందిని పాండే.. అదే ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల శాశ్వత్ గుప్తాను వివాహం చేసుకుంది.
ఈ ప్రేమ వివాహం నందిని పాండే కుటుంబ సభ్యులకు ఇసుమంతైనా నచ్చలేదు. ఎందుకంటే దశాబ్దంన్నర కాలంగా నందిని పాండే, శాశ్వత్ ను అన్నా అని పిలుస్తూ.. ఏటా రాఖీ పండుగ రోజున రాఖీ కట్టేది. దీంతో నందనీ పాండే కుటుంబ సభ్యులు కూడా అతడిని తమ ఇంట్లో కుటుంబ సభ్యుడిగానే చూసుకుంటూ వచ్చారు.
అటువంటిది నందినీ పాండే, శాశ్వత్ లు ఈ నెల 20న చెప్పా పెట్టకుండా ఇళ్ల నుంచి పారిపోయి వివాహం చేసుకున్నారు. ఇది తెలిసిన నందినీ పాండే కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికీ, మనస్తాపానికీ గురయ్యారు. శాశ్వత్ తమ నమ్మకాన్ని వమ్ము చేశాడని, తమ కుమార్తెను మాయమాటలతో తీసుకెళ్లాడని నందిని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, ఆమె భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.
.webp)
అయితే.. నందిని మాత్రం కుటుంబ సభ్యుల ఆరోపణలను ఖండించింది. తాను, శాశ్వత్ పరస్పరం ఇష్టపడి, స్వచ్ఛందంగానే వివాహం చేసుకున్నామని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది. తనపై ఎవరి ఒత్తిడి చేయలేదని, తన భర్త శాశ్వత్ తో భర్తతో సంతోషంగా ఉన్నానని పేర్కొంది. తన పుట్టింట్లో వేధింపులు ఎదుర్కొన్నాననీ, అత్తింటి వారు తనను ఆదరిస్తున్నారని తెలిపింది. దీంతో నందిని రెడ్డి తండ్రి.. తన కుమార్తె చచ్చిపోయిందని ప్రకటించారు. అంతటితో ఆగకుండా, ప్రతీకాత్మకంగా నందిని రెడ్డి అంత్యక్రియలు నిర్వహించి పిండ ప్రదానం చేయడమే కాకుండా, కుమార్తె ఫొటోకు స్వర్గీయ అని క్యాప్షన్ కూడా తగిలించాడు.
[Prayagraj Marriage, Nandini Pandey, Shashwat Gupta, Rakhi brother, Love Marriage, Uttar Pradesh, Last Rites, Telugu One]


