BCCI కొత్త చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా..కమిటీలో రమేష్ పవార్‌కు చోటు.!
Published on: Mon Oct 19, 2026 5:07PM

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ కూర్పులో కీలక మార్పులు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. గత మూడేళ్లుగా భారత చీఫ్ సెలెక్టర్‌గా అత్యుత్తమ సేవలు అందించిన అజిత్ అగార్కర్ పదవీ కాలం ముగియడంతో, ఆ స్థానంలో మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజాను బోర్డు కొత్త ఛైర్మన్‌గా నియమించింది. అత్యధిక టెస్టు మ్యాచ్‌లు ఆడిన సీనియారిటీ ప్రాతిపదికన ప్రజ్ఞాన్ ఓజాను ఈ ప్రతిష్టాత్మక బాధ్యత వరించినట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. జట్టు విజయాల్లో అజిత్ అగార్కర్ చూపిన నిబద్ధత, ఆయన తీసుకున్న నిర్ణయాలను బోర్డు ప్రత్యేకంగా కొనియాడుతూ కృతజ్ఞతలు తెలిపింది.

సెలక్షన్ కమిటీలో పటిష్టతను పెంచేందుకు వెస్ట్ జోన్ ప్రతినిధిగా మరో మాజీ స్పిన్నర్ రమేష్ పొవార్‌ను కూడా కొత్త ప్యానెల్లోకి తీసుకున్నారు. ప్రజ్ఞాన్ ఓజా సారథ్యంలో ఏర్పడిన ఈ కొత్త సెలక్షన్ కమిటీ మొత్తం ఐదుగురు సభ్యులతో కూడి ఉంది. ఈ కమిటీలో ప్రజ్ఞాన్ ఓజా ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా, శివ్ సుందర్ దాస్, ఆర్పీ సింగ్, అజయ్ రాత్రా రమేష్ పొవార్ సభ్యులుగా కొనసాగనున్నారు. మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా భారత సెలక్షన్ కమిటీకి హెడ్‌గా బాధ్యతలు స్వీకరించడం పట్ల క్రికెట్ వర్గాలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాబోయే ప్రతిష్టాత్మక 2027 వన్డే ప్రపంచ కప్ టోర్నమెంట్‌తో పాటు వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) ట్రోఫీలను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త కమిటీ తీసుకునే నిర్ణయాలు భారత జట్టు భవిష్యత్తుకు అత్యంత కీలకం కానున్నాయి. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడంలో, సరైన జట్టు కూర్పును ఎంపిక చేయడంలో ప్రజ్ఞాన్ ఓజా నేతృత్వంలోని ఈ నూతన ప్యానెల్ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
[ Pragyan Ojha, BCCI Chief Selector, Ajit Agarkar, Ramesh Powar, Men Selection Committee, Team India selectors, WTC, Shiv Sundar Das, Indian Men Cricket Selection Committee, Indian Cricket News ]


