TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చెల్లి ఆరోగ్యం కోసం: వెట్టి చాకిరీ: తొమ్మిదేళ్ల బాలుడి కష్టం.!

Published on: Thu Oct 1, 2026 3:17PM

చెల్లి ఆరోగ్యం బాగుండాలంటే ఏదో ఒకటి చేయాలనే తపన.. ఆ చిన్నారి బాలుడిని వెట్టి చాకిరీలోకి నెట్టింది.  పాపంపుణ్యం ప్రపంచ మార్గం ఏమీ తెలియని ముక్కుపచ్చలారని ఓ తొమ్మిదేళ్ల పిల్లాడు ఆటలు, బడి వదిలి.. చెల్లెలి ఆరోగ్యం కోసం చెమటోడుస్తున్న పరిస్ధితి.

ప్రకాశం జిల్లా ఆ మద్దిపాడు మండలం బోరవారిపాలెంలో  వెలుగు చూసిన ఈ ఘటన ఒకే సమయంలో పరిమళించిన మానవత్వాన్ని, కళ్లు చెమ్మగిల్లే చేదు నిజాన్నిఅద్దం పట్టినట్లు చూపింది.  చెల్లెలి కోసం కష్టాన్ని నమ్ముకుని భవిష్యత్ ను వెట్టికి తాకట్టు పెట్టిన ఆ తొమ్మిదేళ్ల బాలుడిలో పరిమళిస్తున్న అనుబంధపు గుబాళింపు ఒకటైతే.. పేదరికం బతుకులను కాల్చేస్తున్న కఠిన వాస్తవం మరో వైపు. 

చిన్న వయసులోనే చెల్లి ఆరోగ్యం కోసం కష్టపడుతున్న బాలుడి పరిస్థితి  కలచివేస్తోంది. చెల్లికి వైద్యం అందించేందుకు కుటుంబం ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో బాలుడు పడుతున్న కష్టానికి సంబంధంచిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ప్రభుత్వం ఆ బాలుడి కుటుం బాన్ని ఆర్థికంగా ఆదుకుని, ఆ బాలుడి చెల్లెలికి మెరుగైన వైద్యం కోసం సహాయం అందించాలనీ, అలాగే ఆ బాలుడి చదువు, సంక్షేమానికి పూచీ పడాలని నెటిజనులు డిమాండ్ చేస్తున్నారు.  

[Poverty, Bonded Labour, 9Years Boy, Sister, Health, Prakasham District, Telugu One]