చికెన్ వ్యర్థాల మాఫియాపై సైబరాబాద్ పోలీసుల కొరడా.!
Published on: Mon Aug 24, 2026 11:57AM

హైదరాబాద్‌లో చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా, విక్రయాలపై సైబరాబాద్ పోలీసులు, వెటర్నరీ అధికారులు కొరడా ఝుళి పించారు. నగరంలోని చికెన్ షాపులు, ప్రాసెసింగ్ కేంద్రాల నుంచి సేకరించిన వ్యర్థాలను రాత్రివేళల్లో లారీల్లో తరలిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లోని చేపల చెరువుల యజమానులకు విక్రయిస్తున్న మాఫియాపై అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దాదాపు వంద టన్నుల చికెన్ వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నారు.
అత్తాపూర్, మియాపూర్, అమీన్‌పూర్, కూకట్‌పల్లి, జీడిమెట్ల, చింతల్ ప్రాంతాల్లో లారీల్లో చికెన్ వ్యర్థాలను డంప్ చేసి తరలిస్తున్న సమయంలో అధికారులు నిర్వహించారు. చికెన్ వ్యర్థాలను సేకరించి వాటిని చేపల చెరువుల యజమానులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటు న్నట్లు అధికారులు గుర్తించారు. పగటిపూట నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి చికెన్ వ్యర్థాలను సేకరిస్తున్న మాఫియా.. వాటిని గుట్టు చప్పుడు కాకుండా రాత్రివేళల్లో లారీల్లో తరలిస్తున్నట్లు గుర్తించారు. అనంతరం ఏపీలోని చేపల చెరువుల యజమానులకు ఈ వ్యర్థాలను విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. చికెన్ వ్యర్థాల అక్రమ రవాణాపై గతంలోనూ కేసులు నమోద య్యాయని, అయినప్పటికీ మాఫియా కార్యకలాపాలు ఆగలేదని అధికారులు చెబుతున్నారు. గత నెలలోనే హెచ్-ఫాస్ట్ అధికారులు సుమారు 100 టన్నుల చికెన్ వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నారు.
తాజాగా మరోసారి అదే తరహాలో వ్యర్థాలను తరలిస్తుండటంతో అధికారులు దాడులు నిర్వహించి వంద టన్నుల వ్యర్ధాలను స్వాధీనం చేసుకున్నారు.చికెన్ వ్యర్థాలను చేపలకు మేతగా వినియోగించ డం వల్ల ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. చికెన్ వ్యర్థాల సేకరణ, అక్రమ రవాణా, విక్రయాల వెనుక ఉన్న మాఫియా నెట్‌వర్క్‌పై పోలీసులు దృష్టి సారించారు. వ్యర్థాలను ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు? ఎక్కడికి తరలిస్తున్నారు? ఎవరికి విక్రయిస్తున్నారు? అన్న కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
Police seize 100 tons Vhicken waste, Cybarabad Police, Raids, Vehicles, Transport chicken Waste, Ap


