TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మోడీ నోట మళ్లీ దిమాగీ నక్సల్ మాట.!

Published on: Sun Sep 6, 2026 1:09PM

ప్రధాని నరేంద్రమోడీ మరోసారి దిమాగీ నక్సల్ ప్రస్తావన తీసుకువచ్చారు. ఈ ఏడాది పంద్రాగస్టు సందర్భంగా ఎర్రకోట బురుజులనుంచి తాను చేసిన ప్రసంగంలో ప్రధాని మోడీ తొలి సారి దిమాగీ నక్సల్ ప్రస్తావన తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. కాగా అప్పట్లో మోడీ దిమాగీ నక్సల్ అన్న మాటపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దిమాగీ నక్సల్ అన్న పదం రాజకీయవర్గాలలోనే కాకుండా నెటిజనులలో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.

మావోయిజంపై ప్రభుత్వం సాధించిన విజయాలను వివరిస్తూ..  అడవుల్లో సాయుధ నక్సలిజాన్ని తుడిచిపెట్టామని చెబుతూ..  సిద్ధాంతపరంగా ఆలోచనల్లో ఉండే  దిమాగీ నక్సల్స్ సమాజంలో ఇంకా మిగిలే ఉన్నారని ప్రధాని మోదీ అన్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. పంద్రాగస్టు నాటి ప్రసంగంలో ప్రధాని మోడీ  దిమాగీ నక్సల్స్ అంటూ ఆలోచించనా పరులు, మేధావులను టార్గెట్ చేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. 

తన విధానాలను విమర్శించే వారికి నక్సల్ బ్రాండ్ వేసే ప్రయత్నంలో భాగంగానే  మోడీ   దిమాగీ నక్సల్ అంటూ తన వ్యతిరేకులను టార్గెట్ చేశారని నెటిజనులు ఓ రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అర్బన్ నక్సలైట్లు అని మేధావులపై బ్రాండ్ వేసిన సంగతిని గుర్తుచేస్తూ..  అర్బన్ నక్సల్,   రూరల్ నక్సల్  పదాల సరసన ఇప్పుడు దిమాగీ నక్సల్ అన్న పదం చేరిందంటున్నారు.  

ఇప్పుడు తాజాగా మోడీ మరో సారి దిమాగీ నక్సల్ ప్రస్తావన తీసుకువచ్చారు.   తాజాగా దేశ రాజధానిలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్  శతాబ్ది వేడుకల్లో పాల్గొని ప్రసంగించిన ప్రధాని మోడీ.. తన దిమాగీ నక్సల్ అన్న పద ప్రయోగం సమాజంలో హోమియోపతి మందులా పని చేసిందని చెప్పుకొచ్చారు. హోమయోపతిలో మందులు వాడన తొలి రోజులలో వ్యాధి లక్షణాలు స్పష్టంగా బయటపడతాయనీ, అంటే వ్యాధి ముదిరిందా అన్నట్లుగా ఆ లక్షణాలు కనిపిస్తాయని చెప్పుకొచ్చిన మోడీ.. సరిగ్గా అలాగే తాను దిమాగి నక్సల్ అనగానే సమాజంలో ఉన్న దిమాగీ నక్సల్స్ అందరూ ఒక్కసారిగా బయటపడ్డాని అన్నారు.  ఈ తరహా భావజాలం ఉన్నవారు ఎవరో ఇప్పుడు దేశ ప్రజలందరూ స్పష్టంగా చూస్తున్నారన్నారు.  

ఇది కూడా చదవండి: దిమాగీ నక్సల్.. మోడీ టార్గెట్ ఎవరంటే?

https://www.teluguone.com/news/content/pm-modi-dimagi-naxal-comments-39-229121.html

గతంలో ఎర్రకోట వేదికగా తాను చేసిన ప్రసంగం సమయంలో కొందరు ఉద్దేశపూర్వకంగానే వ్యతిరేకతను ప్రదర్శించారన్న ప్రధాని మోడీ.. దేశ అభివృద్ధిని వ్యతిరేకించేవారు, దేశం ప్రతిసారీ ఇబ్బందుల్లో పడాలని కోరుకునేవారే ఈ తరహా ఆలోచనలతో ముందుకు వస్తున్నారని  మండిపడ్డారు. అయితే.. తన దిమాగీ నక్సల్ వ్యాఖ్యల తరువత అటువంటి వారి ముసుగులు తొలగిపోయి, వారి నిజ స్వరూపాలు ప్రజల ముందు బట్టబయలయ్యాయని మోదీ చెప్పుకొచ్చారు.  

{[PM Modi Speaks Again On  Dimagi Naxal, Homeopathic pill, SRCC centenary Programmee, Indian Politics, Telugu One]