నినాదం కాదు మా విధానం.. వెలిగొండపై మంత్రి నారా లోకేష్.!
Published on: Mon Aug 31, 2026 11:39AM

రాయలసీమ, ప్రకాశం జిల్లాల దాహార్తిని తీర్చే పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘ కాలంగా కరవు కోరల్లో చిక్కుకుని, తాగు, సాగునీటి కోసం అల్లాడిన ప్రకాశం, రాయలసీమ ప్రజల ముఖాలలో ఆనందం నిండుతుందన్నారు. ప్రజల కళ్లల్లో ఆనంద వెలుగులు అన్నది తెలుగుదేశం కూటమి నినాదం కాదనీ, అది మా విధానమని పేర్కొన్నారు. మూడు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ.. వారి కలలను సాకారం చేస్తూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించారని పేర్కొన్నారు. ఇకపై వలసలకు శాశ్వతంగా ముగింపు పలికినట్లేనన్నారు.
సమగ్ర అభివృద్ధికి వెలిగొండ ప్రాజెక్టు చిరునామాగా మారుతుందన్నారు. ఈ ప్రాజెక్టుకు ఘనస్వాగతం పలికిన ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన లోకేష్.. వెలిగొండ ప్రాజెక్టు కేవలం నీటిని అందించే ఇరిగేషన్ ప్రాజెక్టు కాదనీ.. ఈ ప్రాంత ఫ్లోరైడ్ సమస్యకు పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చే యజ్ణమని పేర్కొన్నారు. నీటి కొరత కారణంగా పొట్టకూటి కోసం వలస వెళ్లిన కుటుంబాలు మళ్లీ తమ సొంత ఊళ్లకు చేరుకుని గౌరవంగా జీవించే రోజులు వెలిగొండతో వచ్చాయన్నారు. సాగునీరు మాత్రమే కాకుండా, ప్రతీ ఇంటికీ సురక్షిత తాగునీటిని వెలిగొండ ద్వారా ఉచితంగా అందుతుందన్నారు.

ఇరిగేషన్ ప్రాజెక్టుల పునర్నిర్మాణం, సకాలంలో పూర్తి చేయడం విషయంలో రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ధృఢ సంకల్పంతో పని చేస్తున్నదని చెప్పిన నారా లోకేష్.. ప్రజలకు నిజాయితీగా మంచి చేయడం ద్వారా వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడమే తాము కొరుకునే క్రిడిట్ అన్నారు.
[Permenent Solution for Floride Problem, Veligonda Project, Nara Lokesh, CBN, Markapuram District, AP Irrigation Projects, Telugu One]


