2029 వరకూ ఆగక్కర్లేదు: మావిగన్ పై ప్రజా తీర్పు ఇదే: జగన్ కు అర్ధమౌతోందా?
Published on: Wed Nov 4, 2026 9:16AM
.webp)
ఆంధ్రప్రదేశ్‌లో మునిసిపోల్ ఫలితాలు ఫలితాలు వైసీపీకి కోలుకోలేని పరాభవాన్ని మిగిల్చాయి. 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తెరపైకి తెచ్చిన మావిగన్ (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు) రాజధాని ప్రతిపాదనను స్థానిక ప్రజలు పూర్తిగా తిరస్కరించినట్లు ఈ ఎన్నికల తీర్పు స్పష్టం చేస్తోంది. అంటే జగన్ 2029 ఎన్నికలకు మావిగన్ నినాదంతో వెడతామని ప్రకటించారు. అయితే అంత వరకూ ఆగక్కర్లేదు, ఆ నినాదంతో ఎన్నికలకు వెడితే ఫలితం ఇలాగే ఉంటుందని మునిసిపోల్స్ లో తమ విస్పష్ట తీర్పు ద్వారా ప్రజలు నిర్ద్వంద్వంగా చాటారు.
గతంలో మూడు రాజధానుల ముసుగులో విశాఖపట్నాన్ని ప్రధాన కేంద్రంగా చూపేందుకు ప్రయత్నించినప్పటికీ, 2024 ఎన్నికల్లో వైజాగ్ నియోజకవర్గాల ప్రజలు వైసీపీని పూర్తిగా పక్కనబెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకుని, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను అనుసంధానిస్తూ మావిగన్ పేరుతో కొత్త పల్లవి ఎత్తుకుంది. అయితే, 2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.

మున్సిపల్ ఫలితాల్లో అధికార తెలుగుదేశం కూటమి తిరుగులేని ఆధిక్యతను సాధించింది. మచిలీపట్నం కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 60 డివిజన్లలో తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేనలు ఏకంగా 48 స్థానాలను కైవసం చేసుకోగా, ఇండిపెండెంట్లు 3 చోట్ల విజయం సాధించారు. వైసీపీ 9 స్థానాలకే పరిమితమైంది. ఇక్కడ టీడీపీకి చెందిన షేక్ అబ్దుల్లా అభిదా మేయర్‌గా విజయం సాధించారు.
అలాగే విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలోనూ ఇదే ఫలితం వచ్చింది. విజయవాడ కార్పొరేషన్‌ను జనసేన అభ్యర్థి వంగవీటి రాధా దక్కించుకోగా, 86 డివిజన్లలో అత్యధిక భాగం తెలుగుదేశం కూటమి ఖాతాలోనే పడ్డాయి. అ గుంటూరు కార్పొరేషన్లో మొత్తం 76 డివిజన్లలో కూటమి మెజారిటీ స్థానాలను గెలుచుకుంది. టీడీపీకి చెందిన కోవలమూడి లక్ష్మీ అపర్ణ మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు. ఈ మూడు నగరాల్లోనూ వైసీపీ కనీస పోటీ కూడా కూడా ఇవ్వలేకపోయింది.
దీంతో 2029 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే మావిగున్ రాజధాని ప్రతిపాదనకు అసలైన రెఫరెండమ్ జగన్ గతంలో పలు సందర్భాలలో చెప్పారు. అయితే ప్రస్తుతం ఈమూడు నగరాల కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి ఎదురైన ఘోర పరాజయం చూస్తుంటే... ఆ రెఫరెండమ్ ఫలితం కోసం ప్రజలు మరో రెండున్నరేళ్లు ఆగాల్సిన అవసరం లేదని స్పష్టమౌతోంది. జగన్ మావిగన్ ప్రతిపాదనను జనం నిర్ద్వంద్వంగా తిరస్కరించారనడానికి ఈ ఫలితాలే నిలువెత్తు నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
[People Reject MAVIGUN, AP Municipal Corporation Election Results, YSRCP Capital Narrative, TDP Janasena Alliance victory, AP politics, Telugu One]


