పల్లె పండుగ రోడ్డు ధ్వంసం: పవన్ కల్యాణ్ సీరియస్.. రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగించాలని ఆదేశం!
Published on: Mon Oct 19, 2026 4:20PM

ఏపీలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే వ్యక్తులు లేదా శక్తుల నుంచి ఆ నష్టాన్ని పూర్తిగా రాబట్టేందుకు రెవెన్యూ రికవరీ చట్టాన్ని కఠినంగా, కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రజా ధనంతో నిర్మించిన సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, బాధ్యతారహితంగా ప్రవర్తించి ఆస్తులకు నష్టం చేకూర్చే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని కుండబద్దలు కొట్టారు.
గతంలో పలు సందర్భాల్లో ప్రభుత్వ, ప్రజా ఆస్తులపై దాడులు జరగడం, వాటిని ధ్వంసం చేయడం వంటి ఘటనలు అధికారుల దృష్టికి వచ్చాయి. అయితే, ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై కేవలం సాధారణ కేసులు నమోదు చేసి వదిలేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చట్టపరమైన చర్యలు ఉండాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు.
.webp)
తాజాగా తిరుపతి జిల్లా, పుల్లంపేట మండల పరిధిలోని అనంతసముద్రం, పాపక్కగారిపల్లె గ్రామాల మధ్య పల్లెపండుగ కార్యక్రమం ద్వారా నిర్మించిన రోడ్డును ధ్వంసం చేసిన ఘటనను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా పరిగణించారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన వైసీపీ నాయకుడు సుబ్బారెడ్డిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకువిస్పష్ట ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ధ్వంసం, తదుపరి చర్యలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో పవన్ కల్యాణ్ సోమవారం (అక్టోబర్ 19) సమీక్షించారు.
[Pawan Kalyan Serious On Palle Panduga Road Destroy, Order Non Bailable, Case, Revenue Recovery Act, Property Damage Action, Telugu One]


