రాఖీ పండుగ కానుక.. 2,439 మంది సోదరీమణులకు పవన్ పట్టు చీరలు.!
Published on: Fri Aug 28, 2026 4:21PM

రక్షాబంధన్ అంటే అన్నాచెల్లెళ్ల అనుబంధానికి అద్దం పట్టే పండుగ. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రక్షాబంధన్ సందర్భంగా తన సొంత నియోజకవర్గం పిఠాపురానికి చెందిన మహిళలకు అన్నగా రక్షా భందన్ కానుకలు అందించారు.
ప్రజా ప్రతినిధిగా కాకుండా, నియోజకవర్గ ఆడపడుచులకుతాను తోడబుట్టిన అన్నగా నిలబతానని ఈ చర్యతో చాటారు. మామూలుగా రక్షాబంధన్ రోజున నాయకులను వెతుక్కుంటూ వెళ్లి మహిళలు రాఖీలు కట్టడం చూస్తుంటాం. పవన్ కళ్యాణ్ అందుకు భిన్నంగా, స్వయంగా తన చెల్లెమ్మల గుమ్మాల వద్దకే ట్టుచీరలను కానుకగా పంపి తన ప్రేమను చాటుకున్నారు. పిఠాపురం నియోజకవర్గం వ్యాప్తంగా పింఛన్లు పొందుతున్న 45 ఏళ్ల లోపు వితంతువులు, ఒంటరి మహిళలను గుర్తించి, మొత్తం 2,439 మంది సోదరీమణులకు రక్షాబంధన్ సందర్భంగా పట్టుచీరలను ప్రత్యేక కానుకలుగా అందజేశారు.
ఈ ప్రత్యేక కానుకలను పిఠాపురం మున్సిపల్ కార్యాలయాలు, మండల పరిషత్ కేంద్రాలకు చేర్చి, స్థానిక నాయకులు, జనసైనికుల ద్వారా అందేలా ఏర్పాట్లు చేశారు. గతేడాది కూడా పిఠాపురంలో 1,500 మందికి పైగా మహిళలకు రాఖీ కానుకలు అందించిన పవన్, ఈ ఏడాది ఆ సంఖ్యను 2,439 కి పెంచి నియోజకవర్గ మహిళల పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
(Pawan Kalyan Raksha Bandhan Gift, Pithapuram women, sarees gift, AP Deputy CM, Rakhi special sarees Pawan Kalyan, Telugu One)


