పవన్ కల్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ.!
Published on: Wed Sep 2, 2026 1:01PM
.webp)
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు ఆయనకు సామాజిక మాధ్యమ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాని నరేంద్రమోడీ పవన్ కల్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. పవన్ కల్యాణ్ ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని భవగంతుడిని ప్రార్ధిస్తున్నానని ట్వీట్ చేశారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సినిమా, రాజకీయ రంగాలలో తనదైన ముద్ర వేసిన పవన్ కళ్యాణ్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ప్రజా సంక్షేమం కోసం పవన్ పడుతున్న తపనను కొనియాడుతూ పవన్ నిండు నూరేళ్లూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి.. చిన్నప్పటి నుంచి సమాజం గురించే కళ్యాణ్ ఆలోచన... ప్రతి అడుగు. పదిమందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పు కణం కళ్యాణ్ అని పేర్కొంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా చిరంజీవి షేర్ చేసిన సందేశంలో తమ్ముడి లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు
[Pawan Kalyan Birthday, JanaSena Chief Pawan Kalyan, Chiranjeevi Birthday Tweet, Chandrababu Pawan Kalyan, Pawan Kalyan Birthday Wishes, Pawan Kalyan News Telugu]


