TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పవన్ పేర సోషల్ మీడియా ఖాతా: లోకేష్ పై ఫేక్ పోస్టులు.. ఒకని అరెస్టు.!

Published on: Thu Oct 8, 2026 11:20AM

రాజకీయ నాయకుల పేర్లు అడ్డుపెట్టుకుని సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేరిట నకిలీ ఎక్స్ ఖాతా సృష్టించి, దాని ద్వారా మంత్రి నారా లోకేష్ పై ఫేక్ పోస్టులు షేర్ చేస్తూ తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.  

నాయకుల పేర్లు, ఫొటోలు ఉపయోగించి సోషల్ మీడియాలో ఖాతాలు తెరవడం.. ఆ ఖాతాలు నిజమైనవేనన్న భావన కలిగించేలా పోస్టులు పెట్టడం.. ఆ తర్వాత వాటిని విస్తృతంగా ప్రచారం చేయడం వంటి వ్యవహారాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ కేసులోనూ నిందితుడు ఇదే తరహాలో నకిలీ గుర్తింపుతో సోషల్ మీడియాను ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. 

 నారా లోకేశ్‌ను టార్గెట్ చేసుకుని తప్పుడు పోస్టులు ప్రచారం చేయడంతో వ్యవహారం పోలీసుల దృష్టికి వెళ్లింది. ఫేక్ అకౌంట్ వెనుక ఎవరు ఉన్నారన్న దానిపై సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. చివరకు సంబంధిత వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 

అదలా ఉంటే.. ఇటీవల చంద్రబాబు, నారా లోకేశ్ పేర్లతో రూపొందించిన డీప్‌ఫేక్ వీడియోలను ఉపయోగించి సైబర్ మోసానికి పాల్పడిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. రాజకీయ ప్రముఖుల పేర్లు, ఫొటోలు, డిజిటల్ గుర్తింపులను దుర్వినియోగం చేస్తూ ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.


[Pawan Kalyan, Name, Fake X Account, Nara Lokesh, Social Media Crime, AP Police, Fake Posts, Arrest, Telugu One]