TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

స్థానిక సమరంపై జనసేనాని నజర్: ఎన్నికల సమన్వయ కమిటీ పవన్ దిశానిర్దేశం.!

Published on: Sat Sep 26, 2026 10:03AM

ఏపీలో వచ్చే నెలలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు.   స్థానిక ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న  ఎన్నికలలో వంద శాతం స్ట్రైక్ రేట్ లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు.  ఇందులో భాగంగానే తాజాగా  మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులతో  బేటీ అయ్యారు.  . క్షేత్రస్థాయి నుంచి పార్టీ శ్రేణులు, నాయకులు అందించిన  సమాచారాన్ని  క్రోడీకరించి ఒక పటిష్టమైన నివేదికను రూపొందించేందుకు ఏర్పాటు చేసిన  ఐదుగురు సభ్యుల కమిటీతో ఈ భేటీ లో పవన్ కల్యాణ్.. గ్రామస్థాయి నుంచి పట్టణ ప్రాంతాల వరకు ప్రజల నాడిని తెలుసుకునేందుకు  పార్టీ యంత్రాంగం ఏవిధంగా ముందుకు వెళ్లాలో   దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో కమిటీ విధివిధానాలు, బాధ్యతపై పవన్ కల్యాణ్   ఆదేశాలు జారీ చేశారు.  . పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తూ, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను, గ్రౌండ్ రిపోర్టులను తనకు నేరుగా నివేదించాలని ఆదేశించారు. గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు పార్టీ బలాలు, బలహీనతలను బేరీజు వేసుకుంటూ పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.  ఈ కమిటీ కార్యకలాపాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగేందుకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పూర్తి  సహకారం  ఉంటాయని   భరోసా ఇచ్చారు.

స్థానిక  ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా తదుపరి కార్యాచరణ, భవిష్యత్ ప్రణాళికలను  ఖరారు చేసేందుకు సోమవారం (సెప్టెంబర్ 28) మరోసారి   స్థాయి సమావేశం కావాలని పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఆ భేటీలో ఎన్నికల వ్యూహంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.  


[Pawan Kalyan, Local Body Elections, Jana Sena Party, Coordination Committee, AP Politics, Pawan Meeting, Telugu One]