TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బెయిల్ ఇవ్వండి లేదా విషం ఇవ్వండి చనిపోతా: జైలులో నటి సంచలన వ్యాఖ్యలు.. !

Published on: Wed Sep 23, 2026 2:44PM

బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉంటూ తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్న కన్నడ నటుడు దర్శన్ కేసులోని ప్రధాన నిందితురాలు పవిత్రా గౌడ కోర్టులో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. రేణుకాస్వామి దారుణ హత్య కేసులో ఏ1 (A1) నిందితురాలిగా జైలు జీవితం గడుపుతున్న పవిత్రా గౌడ, విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఎదుట తన రోదనను వెళ్లగక్కింది. జైలు గదిలో తాను ఎదుర్కొంటున్న నరకయాతనను వివరిస్తూ ఆమె కన్నీటిపర్యూరాలయ్యారు. తనతో పాటు అదే బ్యారక్‌లో ఉంటున్న కొందరు నైజీరియన్ మహిళా ఖైదీల వల్ల తీవ్రమైన మానసిక, శారీరక వేధింపులకు గురవుతున్నానని ఆమె వాపోయారు. 

రాత్రి సమయాల్లో వారు చేసే అల్లరి, గొడవల కారణంగా తనకు కంటి మీద కునుకు కూడా లేకుండా పోతోందని, వారి ప్రవర్తన చూసి తీవ్ర భయాందోళనకు గురవుతున్నానని తెలిపారు. ఇక్కడ ఒక్క క్షణం కూడా బతకలేనని, తనను వెంటనే వేరే బ్యారక్‌కు మార్చాలని ఆమె కోర్టును వేడుకున్నారు. ఒకవేళ తనను ఆ వేధింపుల నుండి రక్షించలేకపోతే, కనీసం తనకు బెయిల్ అయినా మంజూరు చేయాలని, లేదా ఇక్కడ బతకలేకపోతున్నందున కొద్దిగా విషమైనా ఇప్పించండి తాను చనిపోతానంటూ పవిత్రా గౌడ చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి. 

రేణుకాస్వామి హత్య కేసులో మొదట్నుంచీ అనేక సంచలన పరిణామాలు చోటుచేసుకుంటుండగా, తాజాగా జైలు నుంచి బయటికి వస్తున్న ఈ వార్తలు టాలీవుడ్ వర్గాలతో పాటు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జైలు అధికారుల అజమాయషీ  అక్కడ నెలకొన్న భద్రతా పరిస్థితులపై కూడా ఈ ఘటనతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నటుడు దర్శన్ తో కలిసి ఈ కేసులో అరెస్టయిన పవిత్రా గౌడ ప్రస్తుతం చట్టపరమైన పోరాటం చేస్తూనే, మరోవైపు జైలు గోడల మధ్య పడుతున్న ఇబ్బందులను ఇలా బయటపెట్టడం అందరినీ ఆలోచింపజేస్తోంది. న్యాయస్థానం ఈ విజ్ఞప్తిపై ఏ విధంగా స్పందిస్తుందనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది.

 

 

 [ Pavithra Gowda, Bengaluru Central Jail, Renukaswamy murder case, Actor Darshan, Nigerian prisoners, jail harassment, Parappana Agrahara Central Jail, Telugu One, Telugu News ]