TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉక్రెయిన్ పై దాడులకు రష్యా విరామం.!

Published on: Sun Sep 6, 2026 9:45AM

ఉక్రెయిన్ తో యుద్ధానికి రష్యా విరామం ప్రకటించింది.  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు.  ఉక్రెయిన్ పై మూడు రోజుల పాటు వైమానిక దాడులను నిలిపివేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరఫున ప్రత్యేక ప్రతినిధులుగా స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్ పర్యటన సందర్భంగా   రష్యా ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.  

సెప్టెంబర్ 5 (శనివారం) అర్ధరాత్రి నుంచి ఈ 72 గంటల ఈ దాడుల విరామం అమల్లోకిఉంటుంది. అమెరికన్ బృందం రష్యా పర్యటన ముగించుకుని ఆదివారం (సెప్టెంబర్ 6) ఉక్రెయిన్ రాజధాని కైవ్‌లో చర్చలు జరపనున్న నేపథ్యంలో, ఆ దేశ భద్రత,  చర్చల   కోసం ఈ తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పుతిన్ పేర్కొన్నారు.  అంతకుముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ స్పందిస్తూ..  అమెరికా రాయబారులు పర్యటించే మూడు రోజుల పాటు తమ వైపు నుంచి ఎలాంటి దాడులు ఉండవని ప్రకటించారు. దీనికి ప్రతిగా మాస్కో కూడా  దాడులను విరమించాలని  డిమాండ్ చేశారు. 

గత నాలుగేళ్లుగా రష్యా, ఉక్రెయిన మధ్య సాగుతున్న ఈ యుద్ధంలో శాంతి చర్చలను పునరుద్ధరించేందుకు వాషింగ్టన్  ముందుకు వచ్చింది. ఈ శాంతి ప్రతిపాదనను ఇరు దేశాల అధినేతల ముందు ఉంచేందుకు స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్ రెండు దేశాలలో పర్యటిస్తున్నారు.   మాస్కోలో పుతిన్‌తో శనివారం (సెప్టెంబర్ 5) సుదీర్ఘ చర్చల అనంతరం ఆదివారం (సెప్టెంబర్ 6) ఉక్రెయిన్ రాజధాని  కైవ్‌లో పర్యటిస్తున్నారు. మొత్తం మీద అగ్రరాజ్యం అమెరికా మధ్యవర్తిత్వంతో   ఈ  రాయబార ప్రయత్నాలతో అయినా  ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు మార్గం సుగమం కావాలని ప్రపంచ దేశాలు ఆకాంక్షిస్తున్నాయి. 


[Pause in   Russia Ukraine War, Putin Orders Break, Air Strikes, Russia Ukraine war news, US Envoys Moscow Visit,  3 day ceasefire, Telugu One]