TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మనుషులు, జంతువులకు ప్రాణాంతకం: గడ్డిమందుపై నిషేధం.!

Published on: Tue Sep 29, 2026 10:02AM

మనుషులు  జంతువుల ప్రాణాలకు ముప్పుగా పరిణమించిన  హెర్బిసైడ్ పారాక్వాట్ డైక్లోరైడ్‌పై కేంద్ర ప్రభుత్వం  నిషేధం విధించింది. దేశవ్యాప్తంగా ఈ రసాయన పంపిణీని, వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తూ కేంద్రం  ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందనీ, ప్రస్తుతం మార్కెట్లో  ఉన్న అన్ని రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ  నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా పారాక్వాట్‌ను నిషేధించిన 70 దేశాల సరసన  ఇండియా చేరింది. వ్యవసాయ రంగంలో విపరీతంగా వాడే ఈ గడ్డిమందును   ప్రజారోగ్య రక్షణ  కోసం ఈ నిషేధించడాన్ని పర్యావరణ ప్రేమికులు, వ్యవసాయ నిపుణులు స్వాగతిస్తున్నారు.  

ఈ ఏడాది జులై 10న కేంద్రం విడుదల చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై సుమారు 30 రోజుల పాటు వివిధ వర్గాల నుంచి సలహాలు, అభ్యంతరాలను సేకరించిన అనంతరం ఈ గడ్డి మందును నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇన్సెక్టిసైడ్స్ యాక్ట్, 1968లోని సెక్షన్ 27(2), సెక్షన్ 28 నిబంధనల ప్రకారం ఈ నేషధం విధించింది. పారాక్వాట్ డైక్లోరైడ్   విషపూరితమైన రసాయనం కావడంతో, దీనిని స్వల్ప మోతాదులో తీసుకున్నప్పటికీ ప్రాణాపాయం సంభవించే  ముప్పు ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.  

అన్నింటికంటే ముఖ్యంగా ఈ విషానికి నిర్దిష్టమైన విరుగుడు   వైద్య రంగంలో అందుబాటులో లేకపోవడం కూడా ఈ నిషేధానికి  కారణమంటున్నారు. ఈ గడ్డిమందు వినియోగం వల్ల   పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు మరణించిన సంఘటనలు చాలా ఉన్నాయి.   భారతదేశంలో ఆత్మహత్యలు,  విషప్రయోగ కేసులలో పారాక్వాట్ వాడకం ఎక్కువగా ఉన్నట్లు  గణాంకాలు, నివేదికలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో రైతులు, గ్రామీణ ప్రజల ప్రాణాలను కాపాడటమే ధ్యేయంగా కేంద్రం నిర్ణయం తీసుకుంది.  


[Paraquat Dichloride Ban, India Herbicide Ban, Hazardous Pesticides India, Insecticides Act 1968, Toxic Weed Killer, Telugu One]