TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పానీ పూరీలతో గణేష్ విగ్రహం.. బంగారు పూతతో మోదకాలు.!

Published on: Wed Sep 16, 2026 9:29AM

దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రి  ఉత్సవాలు  ఆధ్యాత్మిక శోభతో వైభవంగా జరుగుతున్నాయి.  ఏటా వినాయక నవరాత్రుల వేళ భక్తులు తమ భక్తి భావానికి  సృజనాత్మకతను జోడించి విభిన్న రీతిలో గణనాథుడి విగ్రహాలను ప్రతిష్ఠించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఏర్పాటు చేసిన ప్రత్యేక విగ్రహాలు   ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పుణె నగరంలో కొలువుదీరిన  పానీపూరి గణపతి  నెట్టింట తెగ వైరల్ అవుతూ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. 

పుణెలోని   ఎఫ్‌సీ రోడ్డులో ఉన్న గణేశ్ భేల్ నిర్వాహకులు ఈ వినూత్న ప్రయోగానికి తెరలేపారు. సాధారణంగా అందరూ ఎంతో ఇష్టంగా తినే పానీ పూరీలను ఉపయోగించి 13 అడుగుల ఎత్తైన  గణేశ విగ్రహాన్ని  తీర్చిదిద్దారు. ఈ గణేష్ విగ్రహం తయారీలో 21 వేల పానీ పూరీలను ఉపయోగించారు.  రూపేశ్, దినేశ్ గుడ్మెవార్ అనే  కళాకారులు రెండు నెలల పాటు శ్రమించి ఈ విగ్రహాన్నిరూపొందించారు. ఈ విగ్రహం పాడవకుండా, అలాగే దాని భద్రతను పర్యవేక్షించేందుకు కళాకారులు నిరంతరం అక్కడే అందుబాటులో ఉంటూ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. 

అలాగే చెన్నైలోని  కొళత్తూర్‌లో ఏకంగా 12 వేల  శంఖాలను ఉపయోగించి ఓ భారీ వినాయక విగ్రహాన్ని రూపొందించారు.  ఈ విగ్రహం కూడా పర్యాటకులను, భక్తుల  నాసిక్‌లోని సాగర్ స్వీట్స్ వారు 'గోల్డెన్ మోదకాన్ని తయారు చేశారు.  తినడానికి వీలైన స్వచ్ఛమైన బంగారు పూతతో తయారు చేసిన ఈ ప్రత్యేక మోదకాల కిలో ధర అక్షరాలా  27 వేల రూపాయలు. ఈ బంగారు పూత మోదకాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


[Pani Puri Ganesha, Pune Ganesh Bhel, Creative Ganesha Idols, Ganesh Chaturthi celebrations, Golden Modak Nashik, Telugu One]