TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గ్యాస్ సమస్య అనుకుంటే ప్రాణానికే ప్రమాదం.. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముందస్తు హెచ్చరికలు!

Published on: Thu Sep 3, 2026 11:42AM

 

 

మనలో చాలామందికి భోజనం చేసిన తర్వాత కడుపులో ఉబ్బరంగా అనిపించడం, తరచుగా గ్యాస్, అసిడిటీ, లేదా గుండెల్లో మంట కలగడం సర్వసాధారణమైన సమస్యగా కనిపిస్తుంది. ఇలాంటి జీర్ణకోశ ఇబ్బందులు ఎదురైనప్పుడు చాలామంది స్వయంగా గ్యాస్ మాత్రలు లేదా యాంటాసిడ్లు వేసుకుని సరిపెట్టుకుంటారు. అయితే, చాపకింద నీరులా విస్తరించే సైలెంట్ కిల్లర్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ (క్లోమ గ్రంథి క్యాన్సర్) ప్రారంభ సంకేతాలు కూడా సరిగ్గా సాధారణ గ్యాస్ ట్రబుల్, అజీర్తి రూపంలోనే కనిపిస్తాయని వైద్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ప్రారంభ దశలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు చూపించకపోవడం వల్ల చాలామంది దీనిని సాధారణ ఎసిడిటీగా పొరపడి కాలయాపన చేస్తారు. ఫలితంగా వ్యాధి తీవ్రమై చికిత్స కష్టతరమయ్యే పరిస్థితి దాకా వెళుతుంది. అందుకే, రోజువారీ గ్యాస్ సమస్య వెనుక దాగివుండే ఈ ప్రమాదకర క్యాన్సర్ హెచ్చరికల గురించి ప్రతి ఒక్కరూ సమగ్రమైన అవగాహన కలిగి ఉండటం ఎంతైనా అవసరం.

శరీరంలో ప్యాంక్రియాస్ లేదా క్లోమ గ్రంథి అనేది మనం తీసుకునే ఆహారం జీర్ణం కావడానికి అవసరమైన జీర్ణరసాలు, ఎంజైమ్‌లను ఉత్పత్తులు చేయడంతో పాటు, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే ఇన్సులిన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేయడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. వైద్య నిపుణుల పరిశోధనల ప్రకారం, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధితుల్లో దాదాపు 85 శాతం మందికి వ్యాధి తీవ్రమయ్యే క్రమంలో మధుమేహం (డయాబెటిస్) కొత్తగా రావడం లేదా రక్తంలో చక్కెర స్థాయిలు తీవ్రంగా హెచ్చుతగ్గులకు గురికావడం జరుగుతుంది. అలాగే, దాదాపు 80 శాతం మంది రోగుల్లో  క్యాన్సర్ రిలేటెడ్ అనాలోన్షియా క్యాచెక్సియా సిండ్రోమ్  వల్ల విపరీతమైన ఆకలి మందగించడం, ఏమాత్రం డైటింగ్ లేదా వ్యాయామం చేయకపోయినా వేగంగా బరువు తగ్గిపోవడం, మరియు కండరాల క్షీణత వంటి తీవ్రమైన సమస్యలు కనిపిస్తాయి. కొందరిలో ఈ బరువు తగ్గే సమస్య ఏకంగా 20 శాతం మరణాలకు ప్రధాన కారణంగా మారుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను గుర్తించడంలో మరో ముఖ్యమైన ముందస్తు హెచ్చరిక చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారే కామెర్లు (జాండిస్). క్లోమ గ్రంథిలోని ట్యూమర్ పెరుగుతూ పిత్తవాహికను అడ్డుకున్నప్పుడు, శరీరంలో బైల్రూబిన్ పెరిగిపోయి ఈ పరిస్థితి ఏర్పడుతుంది.పాటు మూత్రం ముదురు పసుపు రంగులోకి మారడం, మలం లేత బూడిద లేదా మట్టి రంగులోకి రావడం, చర్మంపై విపరీతమైన దురద రావడం వంటి సంకేతాలు కనిపిస్తాయి. కొవ్వు పదార్థాలు సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల జిడ్డుగా, తేలియాడే విధంగా మలం రావడం కూడా ప్యాంక్రియాటిక్ ఎంజైమ్‌ల లోపానికి బలమైన నిదర్శనం. అలాగే కడుపు పైభాగంలో ప్రారంభమై వెనుక వెన్నెముక వైపు వ్యాపించే నిరంతర నొప్పి మరొక ప్రధాన లక్షణం. ఈ నొప్పి పడుకున్నప్పుడు లేదా తిన్న తర్వాత ఎక్కువగా అనిపిస్తూ, ముందుకు వంగినప్పుడు కాస్త ఉపశమనం కలిగిస్తుంది. దీనికి తోడు రోగుల్లో కాళ్ల లోతైన రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే  డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (DVT)  సమస్య కూడా అధికంగా కనిపిస్తుంది.

 

 

 

 

Causes of pancreatic cancer and gas symptoms, pancreatic cancer diagnosis and early detection guide.