TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భక్తులకు మెరుగైన రహదారి సౌకర్యమే లక్ష్యం : పవన్ కళ్యాణ్

Published on: Sun Aug 23, 2026 4:52PM

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. భక్తులు ఆలయాలకు సులభంగా చేరుకునేలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 100కుపైగా ప్రధాన క్షేత్రాలను 205 కిలోమీటర్ల మేర రహదారులతో అనుసంధానిస్తున్నారు. ఇందుకోసం సుమారు రూ.120 కోట్లను ఖర్చు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పలు ఆలయాలకు సరైన రహదారి సౌకర్యం లేక భక్తులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడంతో ఈ కార్యక్రమానికి ప్రాధాన్యం లభించింది. క్షేత్రస్థాయి పర్యటనల్లోనూ ఇలాంటి సమస్యలను గుర్తించిన ఆయన.. భక్తుల ఇబ్బందులను తొలగించేలా ఆలయాలకు వెళ్లే రహదారులను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇప్పటికే 26 రహదారుల నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 40 శాతం రహదారుల పనులు సుమారు 50 శాతం మేర పూర్తయ్యాయి. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం, అహోబిలం, ఐ.ఎస్. జగన్నాథపురం, సింగిరికోన, సోమేశ్వరం, తలుపులమ్మలోవ తదితర పుణ్యక్షేత్రాలకు వెళ్లే రహదారుల నిర్మాణం పూర్తయింది. సాస్కీ నిధులతో కోనసీమ తిరుమలగా పేరొందిన వాడపల్లి క్షేత్రం కరకట్ట మార్గం అభివృద్ధి పనులుకొనసాగుతున్నాయి. రూ.3 కోట్లతో అర్థగిరి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ రహదారి నిర్మాణం చేపట్టారు. నిడదవోలు, తెనాలి, రాయచోటి, పూతలపట్టు తదితర ప్రాంతాల్లోని ఆలయాలకు సంబంధించిన రహదారి పనులు కూడా వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. 

శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తి అనుసంధాన రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం రూ.30 కోట్లు కేటాయించింది. శ్రీ సత్యసాయి జిల్లాలో సుమారు 72 కిలోమీటర్ల మేర రహదారి పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఆలయాలకు వెళ్లే రహదారుల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. నిర్మించే రోడ్లు భక్తులకు దీర్ఘకాలం ఉపయోగపడేలా ఉండాలని సూచించారు. పూర్తయిన రహదారులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, భవిష్యత్తులో మరిన్ని పుణ్యక్షేత్రాలకు రహదారి సౌకర్యం కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

Panchayat Raj Department, Sri Sathya Sai Baba Centenary Celebrations, Pawan Kalyan, Singirikona, Someshwaram, CM Chandrababu, AP Goverment