పాకిస్తాన్… బోర్లా పడిపోయి పేలటానికి సిద్ధంగా వున్న అయిల్ ట్యాంకర్!

ప్రపంచంలో పాకిస్తాన్ కంటే అత్యంత ప్రమాదకర దేశం మరేదైనా వుందా? ఖచ్చితంగా లేదనే చెప్పొచ్చు! పాక్ కంటే పేద దేశాలు ఆఫ్రికాలో వుండవచ్చు. పాక్ కంటే చదువుకున్న వాళ్లు తక్కువగా వున్న దేశాలు కూడా బోలెడు వుండవచ్చు. కాని, అక్కడెక్కడా లేని ఉన్మాదం, అజ్ఞానం పాకిస్తాన్ లో రాజ్యమేలుతున్నాయి. అందుకు తాజా ఉదాహరణ, 50వేల లీటర్ల పెట్రోల్ ట్యాంకర్ పేలిపోవటం! అటుఇటుగా 2వందల మంది నెత్తుటి ముద్దలై అగ్నికి బలికావటం!

 

పాక్ లో ప్రమాదం అనగానే అదేదో ఉగ్రవాద చర్య అయి వుంటుంది అని అనుకోవటం సహజం! గతంలో అలాంటి విచక్షణా రహితమైన ఉగ్ర చర్యలు బోలెడు జరిగాయి కూడా. చిన్న చిన్న పిల్లలు స్కూల్లో చదువుకోటానికి వెళితే వార్ని కూడా వదల లేదు జిహాదీలు. మానవబాంబులుగా మారి తమని తాము చంపుకుని, అభం శుభం తెలియని పసికందుల్ని చిదిమేశారు. పెషావర్ లో జరిగిన అత్యంత దారుణమైన ఆర్మీ స్కూలు బాంబు పేలుడు ఎవ్వరూ మరిచిపోలేరు. కాని, రంజాన్ కు సరిగ్గా ఒక్క రోజు ముందు పంజాబ్ ప్రావిన్స్ లో జరిగింది పూర్తిగా భిన్నమైంది! వందల మందిని హతం చేసిన ఒక విషాదం… ఎలాంటి మతం, ఎలాంటి ఉగ్రవాదంతో సంబంధం లేకుండానే జరిగిపోయింది! కేవలం పాకిస్తాన్ ప్రస్తుతం వున్ అత్యంత దారుణమైన స్థితి వల్ల చోటు చేసుకుంది!

 

కరాచీ నుంచీ లాహోర్ వెళుతోన్న ఒక అయిల్ ట్యాంకర్ బోర్లా పడింది. ఫలితంగా వేల లీటర్ల పెట్రోల్ హైవేపై ప్రవహించింది. చుట్టుపక్కల జనం ఆత్రంగా ఇంధనం తీసుకుపోవటానికి పరుగెత్తుకొచ్చారు. అదీ ఆడవాళ్లు, చిన్న పిల్లలు ఎక్కువగా వచ్చారు. ఇది మానవ సహజమైన ప్రవర్తనే! ఎక్కడైనా పెట్రోల్ రోడ్డు మీద పొంగి ప్రవహిస్తుంటే జనం ఆశతోనో, కక్కుర్తితోనో అక్కడికి వస్తారు. కాని, అత్యంత ప్రమాదకరమైన ఇంధనం రోడ్డుపై ఉప్పొంగుతోంటే… పోలీసులు ఏం చేస్తున్నారు? వేల మంది జనం పెట్రోల్ కోసం ఎగబడే దాకా వార్ని అనుమతించింది ఎవరు? ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటే పాక్ దయనీయ స్థితి ఇట్టే అర్థమైపోతుంది!

 

రోడ్డు మీద అయిల్ ప్రవహిస్తూ వుంటే , జనం అక్కడ గుమిగూడుతుంటే... అమెరికా లాంటి దేశాలు కాదు ఆఫ్రికా దేశాల్లో సైతం పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని  అగ్ని ప్రమాదం సంభవించకుండా చూస్తారు. కాని, పక్క దేశాల్లో అరాచకం సృష్టించేందుకు వేల కోట్లు ఖర్చు చేసే ఉగ్రవాద దేశమైన పాక్ లో మాత్రం అలాంటిదేం జరగలేదు. పోలీసులు వచ్చి జనాన్ని పక్కకు తప్పించే లోపే పెట్రోల్ భగ్గుమంది! ఎవడో అమాయకుడో, పిచ్చివాడో, ఉన్మాదో సిగరెట్ కాల్లాడట! అంతే… విలయం క్షణాల్లో జరిగిపోయింది!

 

పెట్రోల్ కోసం ఎగబటంలో పాక్ జనంలోని అజ్ఞానం, వాళ్లని కంట్రోల్ చేయని పోలీస్ వ్యవస్థలో వున్న బలహీనత, అసలు అక్కడ దేశం ఏమైపోయినా పట్టించుకోని రాజకీయ నాయకుల దగుల్బాజీతనం… అన్నీ మనకు ఈ ఒక్క విషాదంలో కనిపిస్తాయి. ఒక్క పెట్రోల్ ట్యాంకర్ ప్రమాదాన్నే సరిగ్గా అరికట్టలేని అక్కడి వ్యవస్థ వందల అణుబాంబుల్ని ఉగ్రవాదుల చేతుల్లో పడకుండా ఎంత కాలం కాపాడుతుంది? ఇది ఇప్పుడు ప్రపంచం వేసుకోవాల్సిన ప్రశ్న! అయిల్ ట్యాంకర్ ప్రమాదం కేవలం ఒక దుర్ఘటన మాత్రమే కాదు. పాక్ లోని అరాచక పరిస్థితులకు ప్రత్యక్ష సాక్ష్యం! ప్రధానంగా పక్కనే వున్న పాకిస్తానీల బద్ధ శత్రువైన భారత్ తేరుకోవటానికి అంది వచ్చిన సంకేతం! పాక్ మన మీదకి పంపే ఉగ్రవాదులు కాదు… ఆ దేశాన్ని సర్వనాశనం చేసే ఉన్మాద శక్తులు కూడా మనకు ప్రమాదమే!

 

పాకిస్తాన్ ఇప్పుడు వున్న స్థితిలో యధాతథంగా వుంటే ఇండియా సహా అనేక దేశాలకు ప్రమాదమే. అందుకే, మోదీ సర్కార్ పాక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాలి. లేదంటే… పాకిస్తాన్ కే శాశ్వత పరిష్కారం వెదకాలి! దాన్ని చిన్న చిన్న ముక్కలు చేయటమే చాలా మంది పండితులు సూచించే మార్గం…