పాకిస్థాన్ లో గణపతి బొప్పా మోరియా.!
Published on: Mon Sep 21, 2026 10:17AM

దాయాది దేశం పాకిస్థాన్ లో గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. ఔను నిజం నిత్యం హిందూ ఆలయాలపై దాడులు, ధ్వంసం వార్తలు వినిపించే పాకిస్థాన్ లో, భారత వ్యతిరేకత నరనరాన నిలుపుకున్న ఆ దేశంలో.. ఈ ఏడు గణపతి నవరాత్రుల వేడుకలను అక్కడి హిందూ సమాజం భక్తిశ్రద్ధతతో వైభవంగా నిర్వహించింది.
కరాచీలో వెలిసిన రత్నేశ్వర మహాదేవ్ ఆలయంలో జరిగిన ఈ ఉత్సవాలు అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా, అక్కడ గణపతి నవరాత్రి వేడుకలు ఘనంగా జరగడం ప్రపంచ దేశాలను విస్మయపరిచింది. భక్తికి ప్రతికూల పరిస్థితులు, సరిహద్దులు అడ్డం కావని పాక్ లో జరిగిన గణేష్ చతుర్ధి వేడుకలు మరోసారి ప్రపంచానికి చాటాయి. ఈ వేడుకల్లో యువత, జెన్-జీ త ఉత్సాహంగా భాగస్వామ్యమయ్యారు. ఈ వేడుకల్లో పాల్గొన్న స్థానిక యువతీ యువకులు గణేశుడిపై తమ భక్తిని చాటుకున్నారు. పర్యావరణ హితమైన మట్టి విగ్రహాలను తయారు చేసే విధానాలను యూట్యూబ్ వంటి మాధ్యమాల ద్వారా నేర్చుకుని పర్యవరణ హిత గణేష్ ప్రతిమలను తయారు చేశారు.

కేవలం సహజ సిద్ధమైన పదార్థాలనే విగ్రహాల తయారీకి వినియోగించారు. రెడీమేడ్ వస్త్రాలు లేదా ఆభరాణాలను వాడకుండా, ప్రతీ అలంకరణను స్వయంగా రూపొందించడమే కాకుండా, సంప్రదాయాలను పాటిస్తూ పూజాదికాలు పాకిస్తాన్‌లో నివసించే మైనారిటీ హిందువులు.. వినయకచవితి పండుగను.. తమ అస్తిత్వాన్ని, సంస్కృతిని సజీవంగా కాపాడుకునే వేదికగా భావించి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించారు. గణపతి బప్పా మోరియా, అగలే బరస్ తు జల్దీ నినాదాలతో గణనాయకుడి నిమజ్జనోత్సవాన్ని నిర్వహించారు.
[Pakistan Ganesh Chaturthi, Karachi Ganeshotsav, Ratneshwar Mahadev Temple, Ganesh Festival pakistan, Pakistan Hindu Community, Ganesh Nimajjanam]


