Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బలూచిస్థాన్ లో చేతులెత్తేసిన పాక్ ఆర్మీ!
posted on: Feb 4, 2026 11:40AM
.webp)
పాకిస్థాన్ లోని అతి పెద్ద రాష్ట్రమైన బలూచిస్థాన్ లో వేర్పాటు వాదులను నియంత్రించడంలో పాకిస్థాన్ ఆర్మీ పూర్తిగా విఫలమైంది. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించి జరుపుతున్న దాడులు పాకిస్థాన్ ను బంబేలెత్తిస్తున్నాయి. బలూచిస్థాన్ కు స్వాతంత్ర్యం అన్న నినాదంలో బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ దాడులను నియంత్రించలేక పాకిస్థాన్ ఆర్మీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నది. అక్కడి వేర్పాటువాదులను నియంత్రించడంలో పాకిస్థాన్ సైనిక బలగాలు చేతులెత్తుస్తున్న విషయాన్ని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్వయంగా నేషనల్ అసెంబ్లీలో వెల్లడించారు.
బలూచిస్థాన్ విస్తీర్ణం పాకిస్థాన్ మొత్తం భూభాగంలో 40 శాతానికి పైగా ఉందన్న ఆయన ఆ ప్రాంత విస్తీర్ణం, పర్వత ప్రాంతాల వల్ల సైన్యంపై తిరుగుబాటు దారులు పై చేయి సాధిస్తున్నారని పేర్కొన్నారు. కాగా బలూచిస్థాన్ ప్రాంతంలో దశాబ్దాలుగా అసంతృప్తి సెగలు రగులుతూనే ఉన్నాయి. ఈ ప్రాంతంలో లభించే గ్యాస్, ఖనిజ సంపదలో తమకు సరైన వాటా దక్కడం లేదని బలోచి జాతీయవాద గ్రూపులు ఆరోపిస్తున్నాయి.
కేంద్రం తమ వనరులను వాడుకుంటూ.. రాష్ట్రాభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తున్నాయి. స్వాతంత్ర్యమే తమ అంతిమ లక్ష్యమని ప్రకటించి, తమ ప్రాంతంలోని వనరులపై తమకే నియంత్రణ ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వారు పాక్ ప్రభుత్వానికి, సైన్యానికి వ్యతిరేకంగా ఆయుధాలు పట్టారు.



.webp)


