TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కన్నీటి విలయం.. నేపాల్‌ జల ప్రళయం.. 900 దాటిన మృతుల సంఖ్య.!

Published on: Mon Aug 31, 2026 12:43PM

 

నేపాల్‌  జల ప్రళయం కన్నీటి విలయమైంది. నేపాల్ వరదల్లో మృతుల సంఖ్య 900 దాటింది. ఇప్పటికీ పలు ప్రాంతాలు  జల దిగ్బంధనంలోనే ఉన్నాయి. గల్లంతైన వారి సంఖ్య కూడా అధికంగా ఉండటంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమౌతోంది. 

నేపాల్ జాతీయ విపత్తు  నిర్వహణ ప్రాధికార సంస్థ  సమాచారం మేరకు, ఇప్పటివరకు 903 మృతదేహాలను వెలికితీశారు. మృతులలో అత్యధికులు నేపాల్  దక్షిణ ప్రాంతంలోని చిత్వాన్ జిల్లా వారే. ఈ   ఒక్క జిల్లాలోనే ఏకంగా 272 మంది మృత్యువాత పడ్డారు. నదుల నీటిమట్టం  తగ్గుముఖం పడుతున్న కొద్దీ  మృతదేహాలు బయటపడున్నాయి. 

ఇంతటి భారీ సంఖ్యలో ప్రాణనష్టం సంభవించడం, మృతదేహాలు రోజుల తరబడి నీటిలో నాని   కుళ్ళిపోతున్న మృతదేహాల వల్ల అంటువ్యాధులు  ప్రబలే ప్రమాదం పొంచి ఉంది.  దేవఘాట్ సమీపంలో కాళీ గండకి, త్రిశూలి నదుల కలయిక స్థలంలో పెద్ద ఎత్తున లభించిన మృతదేహాలను సామూహికంగా ఖననం చేశారు. భవిష్యత్తులో బాధితులను వారి కుటుంబ సభ్యులు గుర్తించే అవకాశం ఉండాలనే ఉద్దేశంతో, ఖననానికి ముందే యంత్రాంగం మృతదేహాల   డీఎన్ఏ నమూనాలను సేకరించి భద్రపరిచింది.

మరోవైపు..  దే గల్లంతు కేసుల సంఖ్య భారీగా ఉంది.  నాలుగు వేల రెండు వందల నలభై ఏడు మందికి పైగా గల్లంతైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.  ఈ గల్లంతైన వారి జాబితాలో వివిధ దేశాలకు చెందిన 592 మంది విదేశీయులు కూడా ఉన్నారు. కొండచరియలు విరిగిపడటం, ప్రవాహాలు ఉధృతంగా ఉండటంతో మారుమూల ప్రాంతాలతో సంబంధాలు పూర్తిగా తెగిపోయి గాలింపు చర్యలకు అడ్డంకిగా మారుతోంది. 

[Over 900 dead in Nepal floods, Nepal disaster death toll, Chitwan flood victims, Devghat mass burial, Nepal rescue operations, Telugu One]